Prostitution in Vijayawada: కష్టపడకుండానే అడ్డదారిలో వచ్చే ఈజీ మనీ కోసం ఎక్కడ ఏం చేస్తున్నామో కూడా చూసుకోకుండా అడ్డదారులు తొక్కుతోన్న కేటుగాళ్లు కొంతమంది అయితే.. కామంతో కళ్లు మూసుకుపోయి పవిత్రమైన గుడి వెనుకాలే పాడు పనులు చేస్తోన్న విటులు ఇంకొంతమంది.. వెరసి విజయవాడ పడవలురేవు గుడి వెనకాల వ్యభిచార దందా మూడు పూవ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కాలేజీ అమ్మాయిలు, యుక్త వయస్సులో ఉన్న పేదింటి ఆడపిల్లలకు ఈజీ మనీ ఆశ చూపి వారి అవసరాలనే ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు ఇక్కడ వ్యభిచారం దందా నడిపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుటుంబ ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉన్న కాలేజీ అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుంటున్న బ్రోతల్ హౌజ్ నిర్వాహకులు.. వారికి లేనిపోని మాటలు చెప్పి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. అనంతరం వారిని ఇక్కడికి రప్పించి, వ్యభిచార గృహల్లోకి దింపుతున్నారు. వీరి బాధితుల జాబితాలో ఎక్కువగా కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈజీ మనీ కోసం అలవాటు పడి కొంతమంది అమ్మాయిలు.. ఆర్థిక అవసరాల కోసం ఇంకొంతమంది తెలియకుండానే వీరి ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. విటుల కామవాంఛలు తీర్చే వేశ్య వృత్తిలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారిని అలా తయారు చేయడంలో ఇక్కడి నిర్వాహకులదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. 


ఉన్నత చదువులు చదువుకుని బంగారు భవిష్యత్తును అనుభవించాల్సిన వారిని తీసుకొచ్చి ఈ నరకప్రాయంలోకి దించి వారి భవిష్యత్తుపై మాయని మచ్చ పడేలా చేస్తున్నారు. గుడి వెనుక ఉన్న ఫ్లాటులో జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్ తో నిర్వాహకులు నెలకు లక్షల రూపాయాల్లోనే ఆదాయం ఆర్జిస్తున్నట్టు స్థానికంగా టాక్ వినిపిస్తోంది.


ఇది కూడా చదవండి : Eluru Student Murder Case: గిరిజన విద్యార్థి హత్య కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరే నిందితులు..!


ఇటువంటి వ్యభిచార నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకుని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడి జేబులు నింపుకుంటున్న బ్రోతల్ హౌజ్ నిర్వాహకుల ఆటకట్టించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సెక్స్ రాకెట్ నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి ఆగడాలను అడ్డుకుంటే, ఇంకెంతో మంది అమ్మాయిల భవిష్యత్తు కాపాడిన వారు అవుతారని స్థానికులు కోరుకుంటున్నారు. వీరి ఆగడాలపై స్థానిక పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.


ఇది కూడా చదవండి : Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK