Rachakonda CP Mahesh Bhagawath: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల శాతం పెరిగింది. 2022 సంవత్సరం ముగింపు సందర్భంగా నేరాలు జరిగిన తీరును సీపీ మహేష్ భగవత్ వివరించారు. కమిషనరేట్ పరిధిలో జరిగిన సంచలన కేసులను కూడా గంటల వ్యవధిలో ఛేదించాం అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను సీపీ అభినందించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఏడోసారి వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో 19 శాతం  క్రైమ్ రేట్ పెరిగిందని వివరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మూడు జోన్లలో సుమారుగా ఈ సంవత్సరం 27362 FIR లు నమోదు అయ్యాయి. ప్రధానంగా సైబర్ నేరాలు గణనీయంగ పెరిగాయని అన్నారు. మొత్తంగా 66 శాతం సైబర్ క్రైమ్స్ పెరిగాయని స్పష్టం చేశారు. మరోవైపు  మర్దర్లు 29% తగ్గడంతో పాటు కిడ్నాప్లు కూడా 38 శాతానికి తగ్గినట్టు చెప్పిన సీపీ.. రోడ్డు ప్రమాదాలు 19%  శాతం పెరిగాయని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు రాచకొండ పరిధిలో 17% గేమింగ్ యాక్ట్ కింద కేసులు పెరిగాయి. మత్తు పదార్థాల కేసులు భారీగా పెరిగాయి. మత్తు పదార్థాలకు సంబంధించి సుమారు 140 శాతం కేసులు పెరిగాయి. మరోవైపు మహిళలపై దాడుల విషయంలో కూడా 17% వరకు నేరాలు పెరిగాయి. రాచకొండ పరిధిలో సుమారు 372 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తెలిసిన వారే హత్యాచారాలకు పాల్పడినట్టు తేలింది. కిడ్నాప్ కేసులు గతేడాది 285 ఉంటే.. ఈ సంవత్సరం 395 నమోదు అయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది 38 శాతం కిడ్నాప్ కేసులు పెరిగి పోలీసులకు సవాల్ గా మారాయి. పొక్సో కేసులు కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. సుమారు 25 శాతం పెరిగినట్లు వార్షిక నివేదిక చెప్తోంది.


ఇక ఆస్తి సంబంధ కేసులు 23% వరకు పెరిగాయి. మానభంగం కేసుల్లో 1.3 శాతం తగ్గుదల కనిపిస్తే.. వరకట్న వేధింపులు, హత్యలలో కూడా 5 శాతం తగ్గుదల కనిపించింది. చీటింగ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పోలీసులకు సవాల్ గా మారిన మానవ అక్రమ రవాణాకు సంబందించిన కేసులు 62 వరకు నమోదు అవ్వడం కలకలం రేపుతోంది. ఈ కేసుల్ని కూడా ఛేదించిన పోలీసులు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 132 మంది అరెస్ట్ చేసి 79 మంది బాధితులను రెస్క్యూ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈసారి కన్విక్షన్ రేటు బాగా పెరిగింది. పోలీసులు పక్కాగా ఆధారాలు సమర్పించడంతో 6503 కేసుల్లో నేర నిరూపణ జరిగి కన్విక్షన్ రేటు 59% పెరిగింది.


రాచకొండ పరిధిలో ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు హడలెత్తించాయి. ఈ సంవత్సరం 3,162 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. ఇందులో 655 మంది మృతి చెందారు. ఇందులో ఓఆర్అర్‌పై జరిగిన 41 రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు. ఈ ఏడాది సుమారు పది కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డిపిఎస్ యాక్ట్ కింద 223 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 635 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 94 మందిపై పిడి యాక్టులు పెట్టీ కటకటాల్లోకి నెట్టారు. మరోవైపు సంచలనం సృష్టించిన నకిలీ సర్టిఫికెట్ల ముఠాలను పట్టుకుని 9 కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేశారు.


రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు పంజా విసిరారు. సుమారు 22 కోట్ల 42 లక్షలు సొమ్మును దొంగిలించారు. ఇందులో పోలీసులు 14 కోట్లు వరకు రికవరీ చేశారు. ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో పలు సంచలన కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసు, సరూర్ నగర్ పరువు హత్య కేసు, స్నేహపురి కాలనీ మహదేవ్ జ్యువలరిలో కాల్పులు జరిపి ఆభరణాలు చోరీ చేసిన కేసులు పోలీసులకు సకాలంలో చేదించారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఈ సందర్భంగా సిపి అభినందించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ ఉన్నతధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని వచ్చే సంవత్సరం కూడా ప్రజలు సహకారంతో మరింత ముందుకు వెళ్తామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.


ఇది కూడా చదవండి : India BF7 Variant: కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలెర్ట్.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు కరోనా టెస్టులు!


ఇది కూడా చదవండి : Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 2023 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం


ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook