Aman Preet Singh Arrest: తెలంగాణలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. డ్రగ్స్‌ నివారణకు అడ్డుకట్ట వేస్తున్నా నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. తాజాగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు ఆమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. అతడితో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు పట్టుబడ్డారని సమాచారం. తాజా పరిణామంతో మళ్లీ సినీ పరిశ్రమకు డ్రగ్స్‌ వ్యవహారం భూతంలా వెంటాడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Anant Radhika Marriage: అంబానీ పెళ్లిలో కలకలం.. అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులు.. వీఐపీల ఆందోళన


సైబరాబాద్ పరిధిలో పోలీసులు దాడులు చేయగా భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఐదుగురు నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సోదరుడు కూడా ఉన్నాడు. దాడుల్లో 200 గ్రాములకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. నైజీరియాను  నుంచి డ్రగ్స్ వచ్చాయి.


Alo Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు


ముంబై, గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన నైజిరీయన్‌ ముఠా నుంచి అమన్‌ప్రీత్‌తోపాటు మరికొందరు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసిన పోలీసులు డ్రగ్స్‌ ముఠాకు అడ్డుకట్ట వేశారు. కాగా గతంలో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సోదరుడు పట్టుబడడంతో రకుల్‌ను డ్రగ్స్‌ భూతం వెంటాడుతోంది. రకుల్‌ హీరోయిన్‌ అయ్యాక తన సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ను సినీ రంగంలో ప్రోత్సహించారు. అతడిని హీరోగా నిలబెట్టేందుకు కృషి చేశారు. అమన్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక సినిమా కూడా చేశాడు. రకుల్‌ జిమ్‌ వ్యవహారాలతో పాటు తన సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు డ్రగ్స్‌ వ్యవహారంలో పట్టుబడడంతో అతడి కెరీర్‌ ముగిసినట్టేనని తెలుస్తోంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter