Anant Ambani Radhika Wedding: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ కుమారుడి పెళ్లిలో కలకలం రేగింది. ఆ పెళ్లికి ఆహ్వానం లేని ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. పెళ్లి చూసేందుకు వచ్చి హడావుడి చేయడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పెళ్లి వేదిక వద్ద రచ్చ చేయడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడం గమనార్హం. వారిలో ఒకరు యూట్యూబర్ అయితే.. మరొకరు వ్యాపారవేత్తగా చెప్పుకుని వచ్చాడని సమాచారం.
Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు
రిలయన్స్ సంస్థల అధినేత, ఆసియాలోనే అతి పెద్ద సంపన్నుడైన ముకేశ్ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అతిరథ మహారథులు ఈ వేడుకకు తరలివచ్చారు. ఆడిపాడి సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి ఆహ్వానం లేకుండా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆహ్వానం లేకుండా వచ్చి వేదిక వద్ద హడావుడి చేయడంతో ఆ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే అరెస్టయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ వెంకటేశ్ అల్లూరి కాగా.. మరొక వ్యక్తి షఫీ షేక్‌గా గుర్తించారు. అయితే షఫీ తనను తాను వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్నారు.
Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్
వీఐపీల పెళ్లి కావడంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అక్కడ వీరిద్దరూ రావడం కలకలం రేపింది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసులు నమోదు చేశారు. వారిద్దరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారని తెలుస్తోంది. అయితే వీఐపీల పెళ్లికి వెళ్లడం.. అక్కడ వివాదం సృష్టించడంపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరిణామాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి