Rapido Driver Abusing Behavior: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై యువతిని ఎక్కించుకుని వెళుతుతున్న క్రమంలో ఒక చెత్తో బైక్ నడుపుతూ.. మరో చెత్తో హస్త ప్రయోగం చేశాడు. భయపడిపోయిన యువతి తన ఇంటికి కొంచెం దూరంలోనే దిగిపోయారు. అనంతరం ఇంటికి వెళ్లిన తరువాత కూడా మెసేజ్‌లో ఆ డ్రైవర్ వేధించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదులోకి తీసుకున్నారు. అతిరా పురుషోత్తం అనే మహిళ  తనకు జరిగిన సంఘటన గురించి ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. మెసెజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కూడా పంచుకున్నారు.పూర్తి వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతిరా పురుషోత్తం ఈ నెల 21న బెంగూళూరులో మణిపూర్ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనేందుకు టౌన్ హాల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో ఆటోలను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆటోలు పదే పదే క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ఆమె బైక్‌ను బుక్ చేసుకున్నారు. రైడ్ కన్ఫార్మ్ అయిన తరువాత ర్యాపిడో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. అయితే యాప్‌లో చూపించిన బైక్ కాకుండా.. మరో బైక్ అతను వచ్చాడు. ఈ విషయంపై అతిరా డ్రైవర్‌ను ప్రశ్నించగా.. బుక్ చేసిన బైక్ సర్వీస్‌లో ఉందని తాత్కాలికంగా ఈ బైక్‌ను వాడుతున్నట్లు చెప్పాడు. సరే అని ఓటీపీ చెప్పి.. బైక్‌పై వెనుక కూర్చొంది.


కొంచెం దూరం వెళ్లిన తరువాత డ్రైవర్ అసభ్య ప్రవర్తన మొదలైంది. ఎదురుగా వాహనాలు రాని సమయంలో ఒక చెత్తో బైక్‌ను నడుపుతూనే.. మరో చెత్త హస్త ప్రయోగం చేశాడు. దీంతో భయపడిపోయిన యువతి.. మౌనంగా కూర్చుండి పోయింది. తన ఇల్లు అతనికి తెలియకూడదని.. 200 మీటర్ల దూరంలోనే దిగి డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లిపోయింది. ఆమె ఇంటికి వెళ్లిన తరువాత ఆ డ్రైవర్ వేధింపులు ఆపలేదు. పదే పదే కాల్స్ చేశాడు. నంబరు బ్లాక్ చేసినా.. మరో నంబరుతో వాట్సాప్‌లో మెసెజ్‌లు పంపించాడు. లవ్ సింబల్స్, కిస్ సింబల్స్ పంపిస్తూ ఇబ్బందికి గురి చేశాడు. ఐ లవ్ యూ అని చెప్పాడు.


 




ఈ ఘటనను మొత్తం వివరిస్తూ.. అథిర ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డ్రైవర్ పంపించిన మెసెజ్‌లకు సంబంధంచిన స్క్రీన్‌షాట్లను కూడా అప్‌లోడ్ చేశారు. బెంగుళూరు సిటీ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇలాంటి అసభ్యకర చర్యలను ఏ మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 


Also Read: Anakapalle Child Death: చిన్నారిని గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల పసికందు మృతి  


Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook