Anuj Thapan: సల్మాన్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. కస్టడీలో కీలక నిందితుడు ఆత్మహత్య
Salman Khan House Firing Accused Died: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Salman Khan House Firing: బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అనుజ్ థాపస్ (32) అనే వ్యక్తి పోలీసుల కస్టడీలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలో ఆత్మహత్యకు పాల్పడడంతో కంగారుపడిన అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Also Read: SR Nagar Oyo Death: ఓయో రూమ్ బాత్రూమ్‌లో ప్రియుడు ఆకస్మిక మృతి.. ప్రియురాలే చంపిందా?
ఏప్రిల్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా వారు ప్రయాణించిన బైక్‌ను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి అనుజ్ థాపస్. ఏప్రిల్ 16వ తేదీన అతడిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
ఈ సమయంలో అనూహ్యంగా బుధవారం పోలీస్ లాకప్‌లో అనుజ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది ఆలస్యంగా గ్రహించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కాగా ఈ కేసులో అనుజ్ కాల్పులకు పాల్పడిన వారికి ఆయుధాలు సరఫరా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడితోపాటు షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్ మరికొందరు అరెస్టయ్యారు. నిందితులను ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కేసుల కింద అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter