Shocking Videos: పోకిరీల భరతం పట్టించిన షీ టీమ్స్.. భక్తి చాటున రసిక రాజాలు
SHE Teams Caught 996 Persons At Hyderabad Ganesh Utsav: భక్తి చాటున కొందరు పోకిరీలు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. గణేశ్ ఉత్సవాల్లో వేధింపులకు పాల్పడిన వారిని షీ టీమ్స్ అరెస్ట్ చేశారు.
SHE Teams Shocking Videos: భక్తి చాటున రసిక రాజాలు రెచ్చిపోయారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వెకిలి చేష్టలకు పాల్పడి దారుణంగా వ్యహరించరు. అసభ్యంగా తాకుతూ.. విచిత్ర చేష్టలతో మహిళలను విసిగించారు. షీ టీమ్స్ లైంగిక వేధింపులకు గురి చేసిన పోకిరీల భరతం పట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల వేధింపులకు గురి చేసిన వారిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. వినాయక నవరాత్రుల్లో 996 మందిని షీటీమ్స్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల్లో భక్తులు ప్రవర్తించిన విధానంపై షీ టీమ్స్ షాకింగ్ వీడియోలు విడుదల చేసింది. ఆడవారిపై ప్రవర్తించిన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Also Read: She Teams: ఖైరతాబాద్ గణేశ్ వద్ద పోకిరీల వెకిలి చేష్టలు.. 285 మంది అరెస్ట్
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షీ టీమ్స్ ప్రత్యేక దాడులు చేపట్టింది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పోకిరీలపై దృష్టి సారించి ప్రూఫ్‌లతో సహా పోకిరీలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈవ్‌టీజింగ్.. అసభ్య చేష్టలతో మహిళలు, యువతులను వేధిస్తున్న వారి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయిన షీ టీమ్స్ ఖైరతాబాద్ బడా వినాయకుడితోపాటు హైదరాబాద్‌లో వినాయక మండపాల వద్ద షీటీమ్స్ ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాకుండా వినాయక నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో కూడా షీ టీమ్స్ దాడులు చేసింది.
Also Read: Rape On Old Lady: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 90 ఏళ్ల వృద్ధురాలిపై యువకుల గ్యాంగ్ రేప్
మహిళల భద్రతకు 24 గంటలు నిబద్ధత.. భద్రతకు కట్టుబడి ఉన్న షీ టీమ్స్ నవరాత్రుల్లో 996 మందిని అరెస్ట్ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో... ఉత్సవాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది. అంతేకాకుండా మహిళలను వేధించిన వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఆ వీడియో చాలా దారుణంగా ఉన్నాయి. మహిళలను తాకరాని చోట తాకుతూ.. పదే పదే శరీరాన్ని తగిలిస్తూ దారుణంగా వ్యవహరించారు. ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. పోకిరీల ప్రవర్తన చూసిన నెటిజన్లు పోకిరీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బహిరంగ ప్రదేశాలు.. ఉత్సవాలు ఎక్కడైనా అసభ్య ప్రవర్తన, వెకిలి చేష్టలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించింది. నిరంతరం మహిళల రక్షణ కోసం తాము పని చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎక్కడా మహిళలకు ఇబ్బంది కలిగినా షీ టీమ్స్ ఉంటుందని మహిళలకు భరోసానిచ్చింది. ఎక్కడైనా ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే డయల్ 100, వాట్సప్‌లో 9490616555 ఫిర్యాదు చేయవచ్చని షీ టీమ్స్ సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.