She Teams: ఖైరతాబాద్‌ గణేశ్‌ వద్ద పోకిరీల వెకిలి చేష్టలు.. 285 మంది అరెస్ట్‌

SHE Teams Caught 285 Persons Red Handed At Khairatabad Bada Ganesh: వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడి వద్ద షీ టీమ్స్‌ ప్రత్యేక చర్యల్లో భారీగా పోకిరీలు పట్టుబడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 14, 2024, 09:29 PM IST
She Teams: ఖైరతాబాద్‌ గణేశ్‌ వద్ద పోకిరీల వెకిలి చేష్టలు.. 285 మంది అరెస్ట్‌

SHE Teams Nabbed Misbehaviour: భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. యువతులు, మహిళలతో భక్తులు అసభ్యంగా తాకుతూ.. విచిత్ర చేష్టలతో విసిగించారు. ఇలా మహిళలతో దారుణంగా వ్యవహరించిన వారిని షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకుంది. ఒక్క వారం వ్యవధిలోనే 285 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ విధంగా ఖైరతాబాద్‌ వినాయకుడి వద్ద భక్తుల ప్రవర్తన జుగుప్సకరంగా ఉంటోంది.

Also Read: Jr NTR Video Call: క్యాన్సర్‌ బాధితుడికి 'దేవర' భరోసా.. నీకేం కాదని ఎన్టీఆర్ గుండె ధైర్యం

 

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షీ టీమ్స్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. వినాయక చవితి నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి పోకిరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈవ్‌టీజింగ్‌ చేస్తూ అసభ్య చేష్టలతో మహిళలు, యువతులను హింసిస్తున్న పోకిరీల భరతం పట్టారు. ప్రత్యేక బృందాలుగా వచ్చిన షీ టీమ్స్‌గా వచ్చిన పోలీసులు ప్రత్యేక దాడులు చేశారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ గణపతి వద్ద చేపట్టిన డ్రైవ్‌పై షీ టీమ్స్‌ ప్రకటన చేసింది.

Also Read: Python Viral: ఏసీబీ ఆఫీస్‌లో భారీ కొండచిలువ హల్‌చల్‌.. బెంబేలెత్తి పడిపోయిన సిబ్బంది

 

మహిళల భద్రతకు 24 గంటలు నిబద్ధత.. భద్రతకు కట్టుబడి ఉన్నామని షీ టీమ్స్‌ ప్రకటించింది. ఎలాంటి అసభ్య ప్రవర్తన, వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిరంతరం మహిళల రక్షణ కోసం పని చేసే తాము ఎక్కడా మహిళలకు ఇబ్బంది కలిగినా తాముంటామని వెల్లడించింది. రానున్న వినాయక చవితి మహా నిమజ్జనం శోభాయాత్రకు మరింత శ్రద్ధ పెడతామని షీ టీమ్స్‌ తెలిపింది. హైదరాబాద్‌లో జరిగే మహా శోభాయాత్రలో యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈనెల 17వ తేదీన జరుగనునన నిమజ్జన యాత్రలో షీ టీమ్స్‌ భారీగా రంగంలోకి దిగి పోకిరీల భరతం పడతామని పోలీస్‌ శాఖ చెబుతోంది. ఎక్కడైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే డయల్‌ 100, వాట్సప్‌లో 9490616555 ఫిర్యాదు చేయవచ్చని పోలీస్‌ శాఖ సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News