Boyfriend Cheats: ప్రేమించి మోసం చేయడమే కాకుండా.. బంగారు ఆభరణాలు తీసుకున్న ప్రియుడిపై ప్రియురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియుడికి సంబంధించిన కారుకు మంటపెట్టింది. ఇదివరకే పెళ్లయిన అతడు తనను ప్రేమించి మోసం చేశాడు. అంతేకాకుండా ఒంటిపై ఉన్న నగలు తీసుకుని తాకట్టు పెట్టుకున్నాడు. తీరా డబ్బులు అడిగితే పరారయ్యాడు. నంబర్‌ బ్లాక్‌ చేయడంతో అతడి ఇంటికి వెళ్లి కారును దగ్ధం చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్టణంలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kattappa Killed: దారుణంగా 'కట్టప్ప'ను చంపేసిన దొంగ.. కారణం తెలిస్తే షాకవుతారు


పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా మచిలీపట్టణానికి చెందిన చలమలశెట్టి అనూష, స్థానిక బిల్డర్‌ విజయ్‌ ఇద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా ఇద్దరూ ఒక్కటే అన్నట్టు బతికారు. సవ్యంగా సాగుతున్న వీరి మధ్య కొన్నాళ్లుగా విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది.

Also Read: Farmer Suicide: రైతు ప్రాణం తీసిన రుణమాఫీ.. ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్య


అయితే ప్రేమించుకుంటున్న సమయంలోనే అనూషకు చెందిన బంగారాన్ని విజయ్‌ పలుసార్లు తాకట్టు పెట్టి కొన్నాళ్లకు తిరిగిచ్చేవాడు. ఇటీవల ఐదోసారి కూడా రూ.15 లక్షలు విలువ చేసే బంగారం విజయ్‌కు అనూష ఇచ్చింది. అతడు బంగారం తాకట్టు పెట్టుకున్నాడు. అంతేకాకుండా రూ.10 లక్షల నగదు కూడా ముట్టచెప్పింది. అయితే ఆ డబ్బులు, బంగారం వారాలు గడుస్తున్నా విజయ్‌ తిరిగివ్వలేదు. వాటి విషయమై అడుగుతుంటే అనూషతో గొడవకు దిగాడు.


ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పిన విజయ్‌ మరొక పెళ్లయిన అనిత అనే అమ్మాయితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయంతో కొన్నాళ్లుగా విజయ్‌ అనూషను దూరం పెట్టసాగాడు. అనూష ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కలిసేందుకు విముఖత చూపడం.. ఫోన్‌ బ్లాక్‌లో పెట్టాడు. ఏం చేయాలో పాలుపోక అనూష పట్టణంలోని విజయ్‌ ఇంటికి చేరుకుంది. విజయ్‌పై కోపంతో అతడి ఇంటి వద్ద ఉన్న కారును పెట్రోలు పోసి తగలుపెట్టేసింది. అనంతరం అనూష నేరుగా చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయం తెలిపింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. విజయ్‌ నుంచి తన డబ్బు, ఆభరణాలు విడిపించాలని విజ్ఞప్తి చేసింది. మరి ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.