Sad Incident: ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తిగా రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుండగా వాస్తవంగా మాత్రం ఎక్కడా 50 శాతం పూర్తి కాలేదని తెలుస్తోంది. ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కొందరు రైతులు రుణమాఫీ కాలేదని మనస్తాపం చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రుణమాఫీ కాలేదనే బాధతో ఓ రైతు బ్యాంకులోనే ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Family Suicide: స్నానం చేయిస్తానని చెప్పి పిల్లలను చెరువులోకి తోసి ఆపై ఆమె దూకి..విషాదం
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి (52) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నాడు. మూడు దఫాల్లో కూడా ఆయనకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కోసం బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే మేడ్చల్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య మంజుల, కొడుకు దినేశ్‌తో కలిసి ఉంటున్నాడు.
Also Read: No Hidden Camera: ఇది నిజం.. గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్‌లో రహాస్య కెమెరాలు లేవు: పోలీస్ శాఖ
మాఫీ కాదేమోననే ఆందోళనతో సురేందర్ రెడ్డి మనస్తాపానికి లోనయ్యారు. చివరకు మేడ్చల్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుణమాఫీ కాలేదని సూసైడ్ నోట్ రాసి ఉండడం గమనార్హం. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ
రుణమాఫీ కాక బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాన్ని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీశ్ రావు, చామకూర మల్లారెడ్డి తదితరులు పరామర్శించారు. గాంధీ ఆసుపత్రిలో మార్చురీలో ఉన్న సురేందర్ రెడ్డి మృతదేహానికి వారు నివాళులర్పించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందని హరీశ్ రావు చెప్పారు.
ఈ సందర్భంగా రైతులకు హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. 'రైతుల్లారా రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది' అని భరోసా ఇచ్చారు. 'ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ నాయకత్వంలో రైతుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం' అని స్పష్టం చేశారు. 'రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి' అని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Farmer Suicide: రైతు ప్రాణం తీసిన రుణమాఫీ.. ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్య