Gang Rape On Ninty Year Old Woman: కామం మైకంలో వయసు కూడా చూడడం లేదు. వయసు మీద పడిన వృద్ధురాలి నడవడానికి కూడా కష్టంగా ఉన్న ఆమెపై బలత్కారం చేశారు. అవ్వ వయసు కలిగిన ఆమెపై దాష్టీకంగా వ్యవహరించారు. ఆమెపై అత్యంత దారుణంగా లైంగిక వాంఛ తీర్చుకున్నారు. సెంచరీకి దగ్గర ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వృద్ధురాలు అపసోపలు పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lover Cheats: ఏపీలో షాకింగ్‌ ఘటన.. ప్రియురాలికి మండింది కారు తగలబెట్టింది


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బండ మాదారం గ్రామానికి చెందిన వృద్ధురాలికి 90 ఏళ్ల వయసు ఉంటుంది. ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఆమె ఒంటరిగా నివసించడంపై అదే గ్రామానికి చెందిన వెంకట్రావు (36)తో పాటు మరో ఇద్దరు యువకులు కన్నేశారు. గురువారం రాత్రి వృద్ధురాలు అని చూడకుండా ఆ ముగ్గురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇద్దరు పరారు
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పరారయ్యారు. వెంకట్రావు పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా సామూహిక అత్యాచారానికి గురయిన వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Also Read: She Teams: ఖైరతాబాద్‌ గణేశ్‌ వద్ద పోకిరీల వెకిలి చేష్టలు.. 285 మంది అరెస్ట్‌


యువకుడు ఆత్మహత్య
ప్రేమ విఫలమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌అమీర్‌లో సాయి గణేశ్‌ (24) నివసిస్తుండేవాడు. తన స్నేహితుడు అరుణ్‌తో కలిసి ఉప్పల్‌లోని సీసీ కెమెరా కార్యాలయంలో అతడు పని చేస్తుండేవాడు. అయితే కొంతకాలంగా ఓ యువతిని సాయి గణేశ్‌ ప్రేమిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అతడి ప్రేమ విఫలమైంది.


ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి లోనయిన సాయి గణేశ్ గురువారం అర్ధరాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున చూసిన కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.