Shraddha Walker Aftab Amin Poonawalla Case: రోజుకో మలుపు తిరుగుతున్న శ్రద్ధా హత్య కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా నుంచి ఢిల్లీ పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అఫ్తాబ్‌ను కోర్టులో హాజరు పర్చగా.. శ్రద్ధాను హత్య చేసినట్లు జడ్జి ముందు నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఢిల్లీ కోర్టు అఫ్తాబ్ పోలీసు కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు దవడ భాగంతో సహా 18 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ, ఛతర్‌పూర్, మైదాన్‌గర్హి, గురుగ్రామ్‌లలో ఈ ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎముకలు మనుషులకు చెందినవా కాదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.


ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న 18 ఎముకలను సీబీఐకి చెందిన సీఎఫ్‌ఎస్‌ఎల్ బృందం దర్యాప్తు చేస్తోంది. సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఒకటి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక వచ్చిన తర్వాతే ఈ ఎముకలు మనుషులకు చెందినవా కాదా అనేది తేలుతుంది.


ఢిల్లీ పోలీసులు, సీబీఐ సీఎఫ్‌ఎస్‌ఎల్ బృందం అఫ్తాబ్ ఇంటి టైల్స్ మధ్య రక్తపు మరకలను గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటివరకు జరిపిన విచారణలో పోలీసులకు కీలక సాక్ష్యాలు కూడా లభించాయి. అఫ్తాబ్, శ్రద్ధా చాలా సార్లు బ్రేకప్ అయ్యారని.. ఆమె హత్య వరకు ఇద్దరు రూమ్‌మేట్స్‌లా జీవించారని పోలీసులు చెబుతున్నారు.


ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ముంబైలలో కూడా శ్రద్ధా హత్య కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. హిమాచల్‌లో అఫ్తాబ్, శ్రద్ధా పర్యటనకు పోలీసులు లింక్‌లను జోడిస్తున్నారు. ముంబైలో ప్రత్యక్ష సాక్షులు, శ్రద్ధా స్నేహితులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. సైబర్ సెల్ ఎఫ్‌ఎస్‌ఓ యూనిట్, సౌత్ స్పెషల్ స్టాఫ్ సహా 200 మంది పోలీసులు శ్రద్ధా కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు.


శ్రద్ధా హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు రానున్న 4 రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. నిందితుడు అఫ్తాబ్‌ను మరోసారి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 4 రోజులపాటు రిమాండ్ పొడగించింది. మే 18 తర్వాత అఫ్తాబ్ మొబైల్ ఫోన్ ఎక్కడేక్కడ ఉందనే కోణంలో రూట్‌ను సిద్ధం చేసుకున్న పోలీసులు.. దాని ఆధారంగా అతను తిరిగిప ప్రదేశాలలో సాక్ష్యాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు.


Also Read: Satyendra Jain Massage: మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్.. ఆ వీడియోలో కీలక మలుపు


Also Read: Shraddha Murder Case Update: శ్రద్ధా హత్య కేసులో కీలక పరిణామం.. కోర్టులో అఫ్తాబ్ ఏం చెప్పాడంటే..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి