Satyendra Jain Massage: మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్.. ఆ వీడియోలో కీలక మలుపు..

Jail Prisoner Give Massage To Satyendar Jain: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ కేసు మరో ములుపు తిరిగింది. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. వివరాల్లోకి వెళితే.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 11:55 AM IST
Satyendra Jain Massage: మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్.. ఆ వీడియోలో కీలక మలుపు..

Jail Prisoner Give Massage To Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ కేసు మరో ములుపు తిరిగింది. మైనర్‌పై అత్యాచార కేసు నిందితుడు తీహార్ జైలులో సత్యేందర్ జైన్‌కు మసాజ్ చేస్తున్నాడని తెలిసింది. ఇటీవల తీహార్ జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ చేస్తున్న సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక వ్యక్తి సత్యేందర్ జైన్ పాదాలకు, శరీరానికి మసాజ్ చేశాడు.

అయితే అతను ఫిజియోథెరపిస్టు కాదని రింకూ అనే ఖైదీ అని తీహార్ జైలు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసినందుకు అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోక్సో సెక్షన్ 6, ఐపీసీ సెక్షన్ 376, 506, 509 కింద రింకూపై కేసులు నమోదయ్యాయి. 

తాజాగా అత్యాచార నిందితుడు సత్యేందర్ జైన్‌కు మసాజ్ చేయడంతో బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. సత్యేందర్ జైన్ అత్యాచార నిందితుడితో ఏం ఒప్పందం చేసుకున్నాడని బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా ప్రశ్శిస్తున్నారు. ఈ మేరకు విమర్శలు గుప్పిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

తీహార్ జైలు నుంచి సత్యేందర్ జైన్ వీడియో వైరల్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్లారిటీ ఇచ్చింది. సత్యేందర్ జైన్‌కు ఫిజియోథెరపీ ఇస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. తీహార్ జైలులోని సీసీటీవీ ఫుటేజీతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సత్యేందర్ జైన్ వెన్నెముక గాయం కారణంగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని చెప్పారు. ఆయన వెన్నెముకకు గాయమైందని.. రెండు సర్జరీలు కూడా చేయించుకున్నారని సిసోడియా తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, వైద్యులు అతనికి ఫిజియోథెరపీ కోసం సలహా ఇచ్చారని అన్నారు. అయితే తాజాగా అత్యాచార నిందితుడు మసాజ్ చేసినట్లు తేలడంతో ఆప్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Also Read: Nicholas Pooran: టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీకి నిలోలస్ పూరన్ గుడ్ బై    

Also Read: Mahesh Babu Wig: మహేష్ విగ్గు రహస్యం బట్టబయలు.. అసలు విషయం బయటపెట్టిన మేకప్ మ్యాన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News