Shraddha Had Decided To Separate From Aftab After Incident Of May: దేశవ్యాప్తంగా ఒళ్లు గగుర్పొడిచేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) తరచూ తనను దాడి చేస్తూ ఉండడంతో శ్రద్ధా ఇబ్బంది పడిందని, ఆ కారణంగా శ్రద్ధా అతడి నుంచి విడిపోవాలని అనుకుందని పోలీసులు గుర్తించారు. మెహ్రౌలీ పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. మే 3-4 తేదీల్లో శ్రద్ధా, అఫ్తాబ్ గొడవ పడడంతో విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నారని సౌత్ జిల్లా పోలీసు అధికారులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయం అఫ్తాబ్‌కి నచ్చలేదని, తనను విడిచి శ్రద్ధ మరొకరి వద్దకు వెళ్లిపోతుందని అతను భావించాడని అందుకే ఆమెను బ్రతిమలాడి తనతోనే ఉండేలా చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఇక పోలీసులు అఫ్తాబ్ ఇంటర్నెట్ హిస్టరీని రిట్రీవ్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, గూగుల్ పే సహా పేటీఎం అలాగే మరిన్ని యాప్‌ల నుండి సమాచారం కోరుతూ పోలీసులు లేఖ రాశారు. ఇక అఫ్తాబ్ ఇంతకుముందు మొబైల్‌లో ఇద్దరికి ఫుడ్ ఆర్డర్లు బుక్ చేసేవాడని జొమాటో పోలీసులకు సమాచారం అందించింది.


కొంతకాలం తర్వాత, అతను ఒక్కరికే ఫుడ్ ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాడని సమాచారం ఇచ్చింది. దీంతో శ్రద్ధను హత్య చేసిన తర్వాత నిందితుడు అఫ్తాబ్‌ ఒక్కటే ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం ప్రారంభించాడన్న అనుమానం మరింత బలపడింది. ఇక అంతకు ముందు, సోమవారం, శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్‌పై దాడి జరిగింది, అఫ్తాబ్‌ను పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తీహార్ జైలుకు తీసుకెళ్తుండగా, అతడి వ్యాన్‌పై దుండగులు దాడి చేశారు. అఫ్తాబ్‌పై దాడి చేసిన వారి వద్ద కత్తులు, సుత్తి ఉన్నాయని అంటున్నారు.  


దుండగుల్లో ఒకరు వ్యాన్ వెనుక తలుపు తెరిచారు. అఫ్తాబ్‌ను వ్యాన్‌లో నుంచి బయటకు తీసి చంపాలనుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలంలోనే ఇద్దరు దాడికి పాల్పడిన వారిని పట్టుకున్నారు. ఆ అనంతరం అఫ్తాబ్‌ను సురక్షితంగా తీహార్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్ విహార్ పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


ఇక మరోపక్క శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్, పాలిగ్రాఫ్ పరీక్షలో తనకు సిగరెట్ తాగాలనే కోరిక ఉందని చెప్పాడు. అతను ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణుల వద్ద సిగరెట్లు అడిగాడు కానీ నిందితుడికి వారు సిగరెట్ ఇవ్వలేదు. సిగరెట్ ఇవ్వకపోవడంతో అతను ఇబ్బందికి గురయ్యాడని అంటున్నారు. శ్రద్ధా హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌కు రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పాలిగ్రాఫ్ పరీక్ష జరుగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఢిల్లీ పోలీసు బృందం అఫ్తాబ్‌తో కలిసి ల్యాబ్‌కు తరలిస్తోంది. 


Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా


Also Read: Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ట్రోలింగ్ వెనుక నరేష్ మూడో భార్య..కేసు నమోదు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook