Geetanjali Suicide: ప్రభుత్వ పథకాల లబ్ధిదారు గీతాంజలి ఆత్మహత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆమె ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అఘాయిత్యానికి ఆమె పాల్పడడానికి కారణమైన వారిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ కేసులో గురువారం ఇద్దరు తెలుగు తమ్ముళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలి చేసిన వీడియోకు దూషిస్తూ.. అసభ్య పదజాలంతో టీడీపీ సోషల్‌ మీడియా విమర్శలు చేసింది. వాటి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. ట్రోలింగ్‌ చేసిన మరికొంత మందిని పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. కాగా తమ పార్టీ కార్యకర్తల అరెస్ట్‌పై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌ పోటీ.. అగ్గి మీద గుగ్గిలమైన పిఠాపురం.. టీడీపీ శ్రేణుల భగ్గు


 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గీతాంజలి ఆత్మహత్య కేసులో గురువారం రెండు కీలక అరెస్ట్‌లు జరిగాయి. విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు (46) అనే వ్యక్తి ఇంటికి వెళ్లి తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు (31) అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు అని గుంటూరు ఎస్పీ తుషార్‌ ప్రకటించారు. 'ట్రోలింగ్‌ కారణంగా గీతాంజలి మనస్తాపానికి గురయ్యారు. ఆమెపై బూతులు తిడుతూ అసభ్య పదాలతో కామెంట్లు చేశారు. ట్రోలింగ్‌ తట్టుకోలేక గీతాంజలి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అసభ్యంగా కామెంట్లు చేసిన 30 అకౌంట్లను గుర్తించాం. ఇవాళ ఇద్దరిని అరెస్ట్‌ చేశాం. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఎస్పీ వెల్లడించారు.

Also Read: OTT Ban: అశ్లీల కంటెంట్‌ ప్రియులకు కేంద్రం భారీ షాక్‌.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రద్దు


 


ఏపీ ప్రభుత్వం పథకాలతో తాను సంతోషంగా ఉన్నానని, ఇప్పుడు తన ఇంటి కల సొంతమైందని, అమ్మ ఒడితో ఆనందంగా ఉందని గీతాంజల్లి చెప్పి వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్‌ పాలనను ఆమె మెచ్చుకోవడంతో కంటగింపు చేసుకున్న టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా బ్యాచ్‌ ఆమెను ట్రోలింగ్‌ చేసింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బండబూతులతో విరుచుకుపడ్డారు. మనస్తాపం చెందిన గీతాంజలి ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఈనెల 7వ తేదీన రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. అధికార వైఎస్సార్‌ సీపీ గీతాంజలి ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఇక సీఎం జగన్‌ ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తదుపరి మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter