Attack on Two Youth Including Dalit: మందమర్రిలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. రెండు మేకలను దొంగతనం చేశారనే నెపంతో దళిత యువకునితో పాటు పశువుల కాపరిని తమ పశువుల కొట్టంలోనే తలకిందులుగా వేళ్లాడదీసి కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మందమర్రికి చెందిన కొమురాజుల రాములు అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్ అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకల పెంపకం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 20 రోజుల క్రితం మంద నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ మేకలు కనిపించకుండా పోవడంపై పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ అనే యువకుడిపై వీళ్లకు అనుమానంతో రావడంతో ఆ ఇద్దరినీ తమ షెడ్డు వద్దకు పిలిపించారు. అక్కడే వాళ్లిద్దరినీ బంధీలుగా తీసుకుని తలకిందులుగా షెడ్డుకు వేళ్లాడదీసి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా వారి చేత నిజం ఒప్పించడం కోసం వారి కింద పొగపెట్టి ఊపిరాడకుండా చేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అతడి కుటుంబసభ్యులు ఆరా తీయగా అసలు విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన తమ్ముణ్ణి కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో కిరణ్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


కిరణ్ సోదరి ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం సంఘటన స్థలానికి బెల్లంపల్లి ఏసిపి సదయ్య, ఎస్సై చంద్రకుమార్ వెళ్లి పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన వివరాలు, ఆధారాలు సేకరించిన అనంతరం ఇద్దరు యువకులను తలకిందులుగా కట్టేసి కొట్టిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాములు, స్వరూప, శ్రీనివాస్, నరేష్‌లపై బెల్లంపల్లి ఏసిపి సదయ్య ఎస్సీ / ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని బెల్లంపల్లి ఏసిపి సదయ్య తెలిపారు. 


[[{"fid":"282094","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SC/ST Atrocity Act, Attack on Dalit youth, Mandamarri, Dalit Man attacked","field_file_image_title_text[und][0][value]":"Attack on Dalit Man: ఇద్దరు యువకులను తలకిందులుగా వేళ్లాడదీసి, కింద పొగ పెట్టి మరీ దాడి"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SC/ST Atrocity Act, Attack on Dalit youth, Mandamarri, Dalit Man attacked","field_file_image_title_text[und][0][value]":"Attack on Dalit Man: ఇద్దరు యువకులను తలకిందులుగా వేళ్లాడదీసి, కింద పొగ పెట్టి మరీ దాడి"}},"link_text":false,"attributes":{"alt":"SC/ST Atrocity Act, Attack on Dalit youth, Mandamarri, Dalit Man attacked","title":"Attack on Dalit Man: ఇద్దరు యువకులను తలకిందులుగా వేళ్లాడదీసి, కింద పొగ పెట్టి మరీ దాడి","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇది కూడా చదవండి : Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన


ఈ ఘటనలో దాడికి పాల్పడిన వారి వ్యవసాయ బావి వద్ద పైపులు చోరీకి గురి కాగా.. వాటిని తేజ, కిరణ్ చోరీకి పాల్పడినట్టుగా అంగీకరించారు. ఆ తరువాత మళ్లీ మేకలు దొంగతనం కావడంతో ఆ నేరం కూడా వీళ్లిద్దరే చేసి ఉంటారనే అనుమానంతోనే వారిని ఇలా తలకిందులుగా వేళ్లాడదీసి హింసించారని.. వారి టార్చర్ భరించలేక ఆ ఇద్దరు కూడా తామే ఆ మేకలు దొంగిలించినట్టు అంగీకరించారని తమ విచారణలో వెల్లడైనట్టుగా ఏసిపి సదయ్య తెలిపారు. దళిత యువకుడితో పాటు మరొక యువకుడిని విచక్షణ రహితంగా కొట్టిన కుటుంబానికి చట్ట పరంగా శిక్ష పడేవిధంగా కేసులు నమోదు చేశామని.. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధిస్తూ ఆదిలాబాద్ జైలుకు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారని సదయ్య పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : Don't Shoot Me In Encounter: నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు ప్లీజ్.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నేరస్తుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి