Don't Shoot Me In Encounter: నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు ప్లీజ్.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నేరస్తుడు

Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్‌కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది. 

Written by - Pavan | Last Updated : Sep 1, 2023, 06:46 AM IST
Don't Shoot Me In Encounter: నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు ప్లీజ్.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నేరస్తుడు

Don't Shoot Me In Encounter: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు వరుస ఎన్‌కౌంటర్లతో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గల్లీ రౌడీల నుండి గ్యాంగ్‌స్టర్స్ వరకు ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల పేరు చెబితే ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు. అంతేకాదు.. బతికుంటే బలుసాకు తినొచ్చు కానీ వీళ్ల చేతికి చిక్కి ఎన్‌కౌంటర్ మాత్రం కావొద్దు అని అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న వాళ్లు కొందరైతే.. ఎంత దూరం అని పారిపోతాం.. ఎంత కాలం అని పారిపోతాం.. ఏదో ఒక రోజు పోలీసులకు ఎదురుపడాల్సిందే కదా అనే జీవిత సత్యం అర్థం చేసుకున్న నేరస్తులు.. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోతున్నారు. 

పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్‌కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది. యూపీలోని గోండా జిల్లాలో మంగళవారం ఓ నేరస్తుడు చాపియా పోలీసు స్టేషన్‌కి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే, " తాను పోలీసులతో యుద్ధానికి రాలేదని.. తనని ఎన్‌కౌంటర్ పేరుతో చంపొద్దు " అని వేడుకుంటూ మెడలో ఒక ప్లకార్డు వేసుకుని వచ్చాడు. మెడలో వేళ్లాడుతున్న ప్లకార్డుపై తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని.. తాను లొంగిపోవడానికే వచ్చానని దానిపై రాసుకొచ్చాడు. 

మెడలో ప్లకార్డుతో వచ్చినంత మాత్రాన్నే పోలీసులు ఎన్‌కౌంటర్ చేయరు అనే గ్యారెంటీ లేదు అని భయపడ్డాడో ఏమో కానీ.. తాను ప్లకార్డుపై రాసుకున్న విషయాన్నే గట్టిగా అరిచి చెప్పడం మొదలుపెట్టాడు. 

 

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సర్కిల్ ఆఫీసర్ నవీనా శుఖ్లా ఈ ఘటనపై స్పందిస్తూ నేరస్తుల్లో వణుకు పుట్టించడంలో తమ పోలీసు శాఖ విజయం సాధించింది అని గర్వంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలీసుల పేరెత్తితేనే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని శుక్లా అన్నారు. 

ఇది కూడా చదవండి : Real Crime Story: కొత్తగా పెళ్లయిన కోడలితో పడుకోవాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే మర్డర్ అయ్యాడు..

ఈ ఘటనలో పోలీసుల ఎదుట లొంగిపోయిన నేరస్తుడి పేరు అంకిత్ వర్మ. అమర్జిత్ చౌహన్ అనే వ్యక్తిని తుపాకీ చూపించి బెదిరించడంతో పాటు అతడి వద్ద ఉన్న బైక్, మొబైల్, పర్స్.. అన్నీ దోచేసుకున్నారు. ఇద్దరు సభ్యుల ముఠా ఈ నిలువు దోపీడికి పాల్పడింది. అమర్జీత్ చౌహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో తేలింది ఏంటంటే.. అంకిత్ వర్మ ముఠానే ఈ దోపిడీకి పాల్పడింది అని తేలింది. దీంతో అతడిని పట్టిస్తే రూ. 20 వేలు నగదు బహుమతి అందిస్తామని ప్రకటిస్తూ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అంకిత్ వర్మ తలపై రివార్డు ప్రకటించారు. దీంతో ఇక తాను తప్పించుకు తిరగడం కష్టం అని భావించిన అంకిత్ వర్మ ఇలా తనే నేరుగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఇది కూడా చదవండి : An Other Agrigold Scam: అధిక వడ్డీ ఆశ చూపించి.. రూ. 1500 కోట్లకు కుచ్చుటోపి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News