UP Husbad attacks his Wife with knife on Karva Chauth 2022: తన భర్త నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి భార్య పూజలు, ఉపవాసాలు చేస్తారు. తన కోసం పూజలు, ఉపవాసాలు చేసే భార్యను చూసి ప్రతి భర్త మురిసిపోతుంటాడు. అయితే తన భార్య ఉపవాసం చేసిందని ఓ కిరాతక భర్త కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్దాయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం (అక్టోబర్ 13) 'కర్వాచౌత్‌' పండుగ కావడంతో హార్దాయ్‌ జిల్లాలోని కొట్‌వాలీ ఆజాద్‌ నగర్‌కు చెందిన మోనీ గుప్తా ఉదయాన్నే పూజలు చేసి.. ఉపవాసం చేస్తున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన మోనీ భర్త మనోజ్‌.. పదునైన కత్తితో ఆమెపై విరుచుకుపడ్డాడు. కత్తి పోట్లకు తట్టుకోలేని మోనీ.. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో మనోజ్‌ ఇంటి నుంచి పరారయ్యాడు. అప్పటికే మోనీ శరీరంపై 12 చోట్ల తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.


మోనీ గుప్తా, మనోజ్‌కు 22 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా మోనీని మనోజ్‌ వేధింపులకు గురిచేస్తున్నాడట. దాడి జరిగిన మూడు రోజుల ముందు కూడా మోనీని  ఆమె భర్త కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. బుధవారం దాడికి పాలపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతోనే మోనీపై మనోజ్‌ దాడికి పాల్పడినట్లు సమాచారం తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Also Read: Manchu Vishnu Comments: మంచు విష్ణు వార్నింగ్ మెగా క్యాంపుకేనా.. ఆ మాటలకి అర్థమదేనా?


Also Read: Pooja Hegde Birthday: ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలు(ఫోటోలు)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook