Pooja Hegde Birthday: ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలు(ఫోటోలు)

 Pooja Hegde celebrates her birthday with Salman Khan and Venkatesh: సల్మాన్ ఖాన్ హీరోగా రుపొందుతున్నకిసీకా భాయ్ కిసీకా జాన్ సెట్స్ లో పూజా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 13, 2022, 09:22 PM IST
 Pooja Hegde Birthday: ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలు(ఫోటోలు)

 Pooja Hegde celebrates her birthday with Salman Khan and Venkatesh: బుట్ట బొమ్మ పూజా హెగ్డే తెలుగులోనే కాదు హిందీలో కూడా పలు వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం తెలుగులో ఆమెకు కాలం కలిసి రాలేదు. తెలుగు అనే కాదు ఈ సంవత్సరం ఆమె చేసిన సినిమాలు ఏవి ఆమెకి కలిసి రాలేదు. విజయ్ హీరోగా చేసిన బీస్ట్ సినిమా, అలాగే రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య సినిమా, ఆమెకు దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందించింది.ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ కూడా దాదాపుగా అదే ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఆమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా రుపొందుతున్నకిసీకా భాయ్ కిసీకా జాన్ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో మన స్టార్ హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నారు. తెలుగు నుంచి జగపతిబాబు కూడా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.  ఇక పూజ హెగ్డే పుట్టినరోజు కావడంతో సెట్స్ లోనే ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.

సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతిబాబు సమక్షంలో కేక్ కట్ చేసిన పూజా హెగ్డే వారి ముగ్గురికి కేక్ తినిపించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి

.

Also Read:

Also Read:

Trending News