Wife Killed Husband In Shahjahanpur video goes viral: కొందరు సమాజంలో పెళ్లికున్న పవిత్ర బంధాన్ని దిగజారుస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఇద్దరు పెరిగిన వాతావరణం అలవాట్లు కంప్లీట్ గా భిన్నంగా ఉంటాయి. దీంతో కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. కానీ కొందరు మాత్రం ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వంట చేయరాలేదని, కూరలో ఉప్పువేయలేదని గొడవలు పడుతుంటారు. మరికొందరు తమ భార్యల మీద అనుమానం పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్లిన, వచ్చిన కూడా గొడవలు పడుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా.. అనుమానంతో కొందరు చంపేందుకు కూడా వెనుకాడరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమాజంలో భార్యభర్తల విషయంలో అనేక దారుణాలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. కొందరు భర్తలు చికెన్ వండలేదని తమ భార్యలతో గొడవలు పెట్టుకుని హత మార్చిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ కోవకు చెందిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హతౌడా గ్రామంలో సత్యపాల్ (40), గాయత్రి దేవీలు (39) ఉండేవారు. వీరికి 20 ఏళ్ల క్రితం పెళ్లైయింది. ఇద్దరు సంతానం. కూతురు బీఏ చదువుతుండగా, కొడుకు ఇంటర్ చదువుతున్నారు.  ఈ నేపథ్యంలో.. ప్రతిరోజు భర్త నాన్ వెజ్ వండిపెట్టాలని , భార్యను శారీరకంగా వేధించేవాడు. తాగి వచ్చి రోజు గొడవలకు దిగేవాడు. గాయత్రి  మాత్రం పూర్తిగా శాఖాహారీ. ఆమె నాన్ వెజ్ వండటానికి ఎక్కువగా ఇష్టపడేది కాదు. కానీ భర్త మాత్రం విన్పించుకునే వాడు కాదు. ఈ క్రమంలో గురువారం కూడా.. రాత్రి బాగా మద్యం తాగి వచ్చి నాన్ వెజ్  వండాలని గొడవకు దిగాడు.


దీంతో భార్య ఎదురుతిరిగింది.అంతేకాకుండా.. భర్తపై ఇటుకతో దాడికి దిగింది.అతను భయంతో పారిపోతుండగా.. అతని మీద కూర్చుని ఇటుకతో తలను పగుల కొట్టింది. అతను చనిపోయిన కూడా.. అతని బుర్ర బద్దలు కొట్టి మాంసం, రక్తంను బైటకు తీసి శాడిస్ట్ గా ప్రవర్తించింది. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు వచ్చిన కూడా మహిళ అతని తలనుంచి రక్తంను బైటకు తీస్తు కూర్చుంది. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter