Love Affair: కూతురుతో మత్తుగా మాట్లాడించి ముగ్గులోకి.. తల్లిదండ్రులు ఇలా కూడా చేస్తారా..?.. స్టోరీ మాములుగా లేదుగా..
Uttar Pradesh: కొన్ని రోజులుగా ట్రాన్స్ పోర్టు బిజినెస్ చేస్తున్న వ్యక్తికి, టీనేజ్ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి వ్యవహరం యువతి ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవలు జరిగాయి. కానీ వీరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకొవడానికి సిద్దపడ్డారు.
Tragic End To Teen Love Sory In Uttar Pradesh: చాలా మంది యువత ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి మొగ్గు చూపిస్తున్నారు. ప్రేమలో ఇద్దరు కలిసి కొంత కాలంపాటు జర్నీ చేస్తారు. ఇద్దరి ఫ్యూచర్ ప్లాన్ లు, ఆలోచనలు కూడా మాట్లాడుకుంటారు. ఒక వేళతమ ఆలోచనలు భిన్నంగా ఉంటే మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.
Read More: Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..
కానీ కొందరి ప్రేమను ఇంట్లోని పెద్దలు ఒప్పుకొరు. దీంతో పెద్దలను ఎదిరించి కొందరు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇంకొందరు మాత్రం.. తమ వారిని వదులుకోలేక సూసైడ్ లకు పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు మాత్రం.. మొదట పెళ్లిచేస్తామని చెప్పి.. ఆ తర్వాత ప్రేమించిన వారిని చంపడానికి , చంపించడానికి కూడా వెనుకాడటం లేదు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని మథురలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. ఆగ్రాలో ట్రాన్స్ పోర్టు బిజినెస్ చేస్తున్న వ్యక్తికి, స్థానిక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు తరచుగా సీక్రెట్ గా కలుసుకునే వారు. ఇదిలా ఉండగా వీరి వ్యవహరం ఇంట్లో వాళ్లకు తెలిసింది. పెళ్లి చేయకుంటే పారిపోతామని ఇద్దరు తెల్చిచెప్పారు. ఈ క్రమంలో యువతి తండ్రి అవదేశ్ యాదవ్ యువతి కోసం అనేక సంబంధాలు చూశాడు.
కానీ యువకుడు పుష్పేంద్ర అడ్డుపడి వాటిని చెడకొట్టాడు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. ఒక ప్లాన్ వేశారు ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పారు. యువతితో, పుష్పేంద్రకు ఫోన్ కాల్ చేయించారు. సీక్రెట్ గా ఒక ప్రదేశానికి మాట్లాడుకుందామని పిలిపించారు. వీరి మాటలు నమ్మిన యువకులు అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ఆయుధాలతో సిద్ధంగా ఉన్న యువతీ బంధువులు, పుష్పేంద్రపై దాడిచేశారు. మారణాయుధాలతో కొట్టి చంపేశారు.
Read More: Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్.. సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్..
యువతి షాకింగ్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత యువకుడిని ఒక కారులో నిర్మానుష్యమైన ప్రాంతంకు తీసుకెళ్లి, దహనం చేశారు. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువతి కుటుంబంపై అనుమానాలున్నట్లు కూడా ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook