Visakhapatnam: రూ.2 వేల నోటు మార్పిడి పేరుతో నయా మోసం.. రూ.60 లక్షలతో పరార్..!
Cheating Case In Visakhapatnam: విశాఖపట్నంలో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. రూ.2 వేల నోట్లు మార్పిడి పేరుతో రూ.60 లక్షలతో ఓ గ్యాంగ్ పరార్ అయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
Cheating Case In Visakhapatnam: మోసపోయే వాళ్లు ఉంటే.. మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తునే ఉంటారు.. కొత్త కొత్త మార్గాల్లో అమాయకులను దోచుకుంటున్నారు. 2 వేల రూపాయల నోట్ల మార్పిడి పేరుతో రూ.60 లక్షలు దోచుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. విశాఖపట్నానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి రూ.2 వేల నోట్లు మార్చి ఇస్తే.. ఎక్స్ ట్రా డబ్బులు ఇస్తామని తెలిసిన వారిని నమ్మించాడు. రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తానని చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామారావుకు తెలిసింది. దీంతో తనకు తెలిసిన వారితో విజయవాడ నుంచి రూ.90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు తెప్పించాడు. ఈ డబ్బులు తీసుకుని.. భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డితో కలిసి శనివారం సాయంత్రం గొల్లలపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వద్దకు వచ్చాడు. ధర్మరాజు, అతని ఫ్రెండ్స్‌తో అప్పటికే ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద వీరికోసం ఎదురుచూస్తున్నారు. రామారావు వద్ద రూ.60 లక్షలు తీసుకుని.. రూ.2 వేల నోట్లు తీసుకువస్తామని అక్కడి ఉడాయించారు.
అయితే ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ధర్మరాజుకు రామారావు కాల్ చేశాడు. నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. చుట్టుపక్కల గాలించినా.. ఎక్కడ కూడా కనిపించలేదు. మోసపోయానని గ్రహించి.. విశాఖపట్నం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే ధర్మరాజుతోపాటు అతని స్నేహితులు అహ్మద్, సునీల్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.60 లక్షలు వసూలు చేశారు.
Also Read: Viveka Letter Judgement: వివేకా లేఖకు నిన్‌హైడ్రిన్ పరీక్ష ఉంటుందా లేదా
ఈ ఘటనపై పోలీసులు సీక్రెట్‌గా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నిందితులు వెనుక సూత్రధారులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎంత మంది ఉన్నారు..? ఎంత మంది ఇలా మోసం చేశార..? వంటి వివరాలు రాబడుతున్నారు. రాజమండ్రిలో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైనట్లు సమాచారం.
Also Read: UPI Cash Withdrawal: ఏటీఎంలో యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook