Viveka Letter Judgement: వివేకా లేఖకు నిన్‌హైడ్రిన్ పరీక్ష ఉంటుందా లేదా, ఎల్లుండే కోర్టు తీర్పు

Viveka Letter Judgement: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అదే జరిగితే వివేకాను హత్య చేసిందెవరో పక్కాగా తెలిసిపోనుంది. ఈ పరిణామం జరగాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 6, 2023, 08:30 AM IST
Viveka Letter Judgement: వివేకా లేఖకు నిన్‌హైడ్రిన్ పరీక్ష ఉంటుందా లేదా, ఎల్లుండే కోర్టు తీర్పు

Viveka Letter Judgement: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో రెండ్రోజుల్లో అత్యంత కీలకమైన నిర్ణయం వెలువడవచ్చు. వివేకా హత్యకేసు నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడే ఈ ప్రక్రియపై కోర్టు నిర్ణయం కోసం సీబీఐ ఎదురుచూస్తోంది.

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా హత్య కేసుల కీలకంగా భావిస్తున్న సంఘటనా స్థలంలో లభించిన లేఖ మరోసారి చర్చల్లోకొచ్చింది. ఈ లేఖలో డ్రైవర్ ప్రసాద్ తన హత్యకు కారణమని, వదిలి పెట్టవద్దని చనిపోయేముందు రాసినట్టుగా ఉంది. ఈ లేఖను నిజంగానే వివేకానందరెడ్డి రాశారా లేదా బలవంతంగా రాయించారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ లేఖను పరీక్షించిన సీఎఫ్ఎస్ఎల్ బలవంతంగా రాసినట్టుగా ధృవీకరించింది. ఈ క్రమంలో ఈ లేఖపై ఇంకెవరివైనా వేలి ముద్రలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కీలకంగా మారింది. అందుకే నిన్‌హైడ్రిన్ పరీక్షకు సిద్ధమైంది సీబీఐ. 

నిన్‌హైడ్రిన్ పరీక్ష అంటే ఎలా ఉంటుంది

నిన్‌హైడ్రిన్ పరీక్ష నేర పరిశోధనకు ఉపకరించే కొత్త ప్రక్రియ. ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా వివేకా చేతిరాతతో పాటు కంటికి కన్పించని, సాధారణ పరీక్షల్లో బయటపడని వేలి ముద్రలు సైతం గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్ష చేయాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఎందుకంటే ఈ పరీక్ష నిర్వహించినప్పుడు కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశాలు ఎక్కువ. అంటే ఆ లేఖ ఇకపై ఏముందో ఇకపై కన్పించకపోవచ్చు. అందుకే ఈ ప్రక్రియ ముందుకు సాగాలంటే న్యాయస్థానం అనుమతితో చేయాల్సి ఉంటుంది. 

Also read: AP govt Employees: ఉద్యోగుల డిమాండ్లలో ప్రభుత్వం అంగీకరించినవి ఏంటంటే..

ఈ లేఖ పరీక్ష చేసేముందు ఆ లేఖ కలర్ జిరాక్స్ రికార్డుల్లో భద్రపర్చాలని సీబీఐ తెలిపింది. అయితే దీనికి నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ పిటీషన్ కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 7వ తేదీ అంటే రేపు ఈ లేఖను నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలా లేదా అనేది తేల్చనుంది. కానీ తాజాగా ఈ ప్రక్రియలో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తమ న్యాయవాదులు సహకరించేలా అనుమతివ్వాలని సునీత పిటీషన్ దాఖలు చేయడంతో 8వ తేదీన తీర్పు వెలువడనుంది.

Also read: Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెగ్యూలరైజ్‌కు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News