Brutally Killed: దారుణం.. ఛాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
Who Denied To Make Tea Daughter In Law Brutally Killed In His Mother In Law: అత్యాకోడళ్ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. చిన్న విషయం కాస్త కోడలిని అత్త దారుణంగా చంపే స్థాయికి చేరింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Family Dispute: కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారి తీశాయి. తాగడానికి ఛాయ్ చేయమని అత్త కోరడంతో కోడలు నిరాకరించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురయిన అత్త తన చున్నీని తీసి కోడలి మెడకు వేసి అత్యంత దారుణంగా హత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఆమె అంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది.
Also Read: Suraj Revanna: కాంచనలా మారిన మాజీ ప్రధాని మనువడు.. అమావాస్య రోజు చీర, గాజులు వేసుకుని
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హసన్ నగర్ ప్రాంతంలో సంగారెడ్డి పట్టణానికి చెందిన పర్వీనా బేగమ్ తన కొడుకు అబ్బాస్, కోడలు అజ్మీర బేగమ్ (28) కలిసి నివసిస్తోంది. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు పని మీద బయటకు వెళ్లగా ఇంట్లో అత్తా కోడళ్లు ఇద్దరు ఉన్నాయి. అయితే గురువారం ఉదయం తాగడానికి చాయ్ పెట్టాలని అత్త పర్వీనా బేగమ్ కోడలిని కోరింది.
Also Read: Leopard Mauls: ఏపీలో చిరుత పులి పుంజా.. కట్టెల కోసం వెళ్లిన మాజీ ఉప సర్పంచ్ మృతి
అయితే చాయ్ పెట్టేందుకు కోడలు అజ్మీరా నిరాకరించింది. చాయ్ పెట్టకపోవడమే కాకుండా నిరాకరించడంతో అత్తకు తీవ్ర కోపం వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అత్త క్షణికావేశానికి లోనయి అక్కడే ఉన్న చున్నీని తీసుకుంది. వెంటనే కోడలి మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోని కోడలిని హతమార్చినట్లు తెలుస్తోంది. తరచూ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తుండడంతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో చిన్న విషయమై గొడవ ప్రారంభమై అది తీవ్ర రూపం దాల్చింది. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు అబ్బాయిలు అన్నారు.
చిన్న విషయం ఇంతటి దారుణానికి దారి తీయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ ప్రాంతంలో ఈ సంఘటన తీవ్ర విషాదం ఏర్పడింది. కాగా అత్త దారుణానికి ఒడిగట్టడంతో మృతురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter