Suraj Revanna: కాంచనలా మారిన మాజీ ప్రధాని మనువడు.. అమావాస్య రోజు చీర, గాజులు వేసుకుని

Suraj Revanna Turns As Kanchana He Wears Saree And Bangles: అతడో మాజీ ప్రధాని మనవడు.. రాష్ట్రంలో కీలక నాయకుడి కుమారుడు. ప్రజా జీవితంలో బాగున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం తేడాగా వ్యవహరిస్తున్నాడు. అచ్చం కాంచన సినిమా గుర్తు చేస్తున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 27, 2024, 11:57 AM IST
Suraj Revanna: కాంచనలా మారిన మాజీ ప్రధాని మనువడు.. అమావాస్య రోజు చీర, గాజులు వేసుకుని

Suraj Revanna Turns As Kanchana: అచ్చం కాంచన సినిమాలో హీరో మాదిరి మాజీ ప్రధానమంత్రి మనవడు వ్యవహరించాడు. అమావాస్య రోజు ఎర్ర చీర కట్టుకుని, నల్లగాజులు వేసుకుని హల్‌చల్‌ చేశాడు. అంతేకాకుండా అబ్బాయిలతో రాసలీలలు సాగిస్తున్నాడు. అతడే సూరజ్‌ రేవణ్న. ఓ వ్యక్తిని లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్‌ అయిన సూరజ్‌ను విచారణ చేస్తుండగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే చీర, గాజుల వ్యవహారం బయటకు వచ్చింది.

Also Read: Love Fail: దేశం మెచ్చింది.. కానీ ప్రేయసి తిరస్కరించింది.. యువ జవాన్‌ ఆత్మహత్య

 

ఓ యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై కర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్న అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అతడిని సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో అరకలగూడులో ఓ యువకుడిని సూరజ్‌ పరిచయం చేసుకుని అతడి ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. అంతేకాకుండా విజిటింగ్‌ కార్డు కూడా ఇచ్చాడు. అనంతరం ఆ యువకుడికి నిత్యం శుభోదయం, వివిధ ప్రత్యేక రోజుల శుభాకాంక్షలు చెప్పడంతో లవ్‌ సింబల్స్‌ పంపుతున్నాడు. 

Also Read: Lizard Biryani: నిన్న చేతి వేలు, నేడు బల్లి.. ఖంగుతిన్న బిర్యానీ ప్రియుడు

 

కొన్నిసార్లు తన ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని అతడితో వ్యక్తిగత సేవలు పొందేవాడు. కాళ్లు నొక్కాలని చెప్పేవాడు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడి అతడిపై సూరజ్‌ రేవణ్న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ఇటీవల ఎన్నికల సమయంలో బయటపడింది. బాధితుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్ణాటకలో కలకలం రేపింది. అయితే అరెస్ట్‌ సమయంలో సూరజ్‌కు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఎర్రచీర కట్టుకుని గాజులు వేసుకుని ఉన్న దృశ్యాలు కనిపించాయి. వాటి గురించి ఆరా తీయగా అమావాస్య రోజు అలా చేస్తున్నట్లు సూరజ్‌ విచారణ చెప్పాడు.

భార్యతో విడాకులు
కాగా సూరజ్‌కు గతంలో వివాహమైంది. సాగరిక అనే యువతితో 4 మార్చి 2018లో సూరజ్‌కు వివాహమైంది. అయితే పెళ్లి తర్వాత సూరజ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్యతో అసహజ శృంగారానికి ప్రయత్నించేవాడు. తేడాగా ప్రవర్తించడంతో సాగరిక అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. వారిద్దరికీ మూడేళ్ల కిందట విడాకులు మంజూరయ్యాయి. తమ్ముడు ఇలా ఉంటే ఈయన అన్న ప్రజ్వల్‌ రేవణన్న కామ పిశాచిగా ఉన్నాడు. దాదాపు 3 వేలకు పైగా అశ్లీల వీడియోలు అతడి లభించడం దేశంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడు, తమ్ముడు ఇద్దరూ జైల్లో మగ్గుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News