Leopard Mauls: ఏపీలో చిరుత పులి పుంజా.. కట్టెల కోసం వెళ్లిన మాజీ ఉప సర్పంచ్‌ మృతి

Leopard Mauls Woman In Andhra Pradesh: ఏపీలో తరచూ చిరుత పులులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది తిరుమలలో ఓ చిన్నారిని పులి బలి తీసుకోగా.. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ మహిళను పులి బలి తీసుకుంది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 25, 2024, 08:19 PM IST
Leopard Mauls: ఏపీలో చిరుత పులి పుంజా.. కట్టెల కోసం వెళ్లిన మాజీ ఉప సర్పంచ్‌ మృతి

Leopard Mauls Woman: ఆంధ్రప్రదేశ్‌లో చిరుత పులి పంజా విసిరింది. కొన్ని రోజులుగా హల్‌చల్‌ చేస్తున్న పులి ఎట్టకేలకు తన ఆకలిని తీర్చుకుంది. పులి పంజాకు మాజీ ఉప సర్పంచ్‌ బలి అయ్యారు. కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమెపై పులి విరుచుకుపడి తినేసింది. ఈ సంఘటన నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు

నంద్యాల జిల్లా మహానంది, సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో ఇటీవల తరచూ పులి కనిపిస్తూ బెంబేలెత్తిస్తోంది. తరచూ పులి ఆనవాళ్లు కనిపిస్తుండడంతో ఇక్కి పరిసర ప్రాంత ప్రజలు భయంభయంతో బతుకుతున్నారు. ఇదే క్రమంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరున్ బీ మంగళవారం  కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు.

Also Read: Chennai: యువకుడి ప్రాణం తీసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె.. కారుతో చెన్నైలో హల్‌చల్‌

నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్లలో కట్టెలు తీసుకుని వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆమెపై పులి విరుచుకుపడింది. ఆమెపై దాడి చేసి బలి తీసుకుంది. చిరుత పులి దాడిలో ఆమె మృతి చెందిందని మెహరున్‌బీ బంధువులు తెలిపారు. కట్టల కోసం అడవి ప్రాంతంలోకి వెళ్లి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అటవీ ప్రాంతంలో పులి దాడిలో ఆమె చనిపోయి కనిపించారని వివరించారు. ఆమె తల, బాడీ వేరువేరుగా ఉన్నాయని దుఖిస్తూ చెప్పారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. 

స్థానికుల ఫిర్యాదుతో చలమా రేంజ్ అధికారి ఈశ్వరయ్య, డీఆర్ఓ రాజు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిరుత పులి దాడి చేసిందా? లేక ఇతర జంతువు ఏమైనా దాడి చేసిందా అని అధికారులు విచారణ చేస్తున్నారు. పులి దాడిలో ఆమె మృతితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా నాలుగు రోజుల కిందట కూలీ షేక్ బీబీపై కూడా పులి దాడి చేసింది. తృటిలో ఆమె తప్పించుకున్నారు. కాగా పులి సంచారం వార్తతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News