Madhya Pradesh Crime: భర్తపై కోపంతో నలుగురు పిల్లలతో బావిలోకి దూకిన మహిళ.. కానీ చివరకు..!
Woman Jumps Into Well With 4 Children: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఓ మహిళ భర్తపై కోపంతో నలుగురి పిల్లలను బావిలోకి తోసి.. అనంతరం తాను కూడా దూకేసింది. చివరకు ప్రాణభయంతో తన పెద్ద కూతురిని తీసుకుని మళ్లీపైకి వచ్చింది. వివరాలు ఇలా..
Woman Jumps Into Well With 4 Children: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. అయితే మహిళ దూకిన తరువాత బతకాలని భావించింది. బావి లోపల వేలాడుతున్న ఓ తాడును పట్టుకుని పెద్ద బిడ్డను తీసుకుని పైకి వచ్చి ప్రాణాలను రక్షించుకుంది. అయితే మిగిలిన ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మహిళ క్షణికావేశానికి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటన బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత మహిళను ప్రమీలా భిలాలాగా గుర్తించినట్లు పోలీ తెలిపారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఆ మహిళ తన భర్తతో గొడవపడిందని.. అనంతరం కోపంతో ఆమె తన నలుగురు పిల్లలను తీసుకుని బావిలోకి దూకినట్లు పోలీసులు చెప్పారు. కానీ బావిలోకి దూకిన తరువాత ఆ మహిళ నీటిలో భయపడిందని.. బయటకు రావడానికి చేతులు, కాళ్లు కొట్టిందన్నారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో మహిళ బావిలో వేలాడుతున్న తాడును పట్టుకుని బయటకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే తన పెద్ద కూతురును కూడా బయటకు తీసుకువచ్చిందన్నారు.
అయితే మరో ముగ్గురు పిల్లలు నీటిలో మునిగి చనిపోయారని తెలిపారు. 5 ఏళ్ల కుమార్తె, 3 ఏళ్ల కుమార్తె, 18 నెలల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆ మహిళ, ఆమె కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. ఈ బావి మహిళ ఇంటికి అతి సమీపంలో ఉందని ఎస్పీ రాహుల్ కుమార్ తెలిపారు. బావిలో నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసినట్లు చెప్పారు. కేసును పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: Aha New CEO: ఆహా కీలక నిర్ణయం.. కొత్త సీఈఓ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి