Extra Marital Affairs: కర్ణాటక బెంగళూరులోని ఓ వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడి భార్య రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. చివరికి కటకటాలపాలైంది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక బెంగళూరులోని యెళహంకకు చెందిన చంద్రశేఖర్‌ (35), శ్వేత భార్యాభర్తలు. చంద్రశేఖర్ కార్మికుడిగా పనిచేస్తుండగా.. శ్వేత ఎమ్మెస్సీ చదివింది. అయితే ఆమె కాలేజీలోనే చెడు దారులు తొక్కింది. సినిమాలు, షికార్లు, డేటింగ్స్ అంటూ ఇష్టానుసారం తిరిగింది. శ్వేతకు 15 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని.. కొద్ది రోజులు వాళ్లతో తిరిగి తరువాత బ్లాక్‌లిస్టులో పెట్టి వదిలించుకునేదని తెలిసింది. 


కాలేజీలోనే కాకుండా తమ ఇంటి ఓనర్ కుమారుడితో శ్వేత సన్నిహితంగా మెలిగింది. అతనితో కలిసి బైక్‌పై కాలేజీకి వెళుతున్నట్లు తెలిసింది. చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా శ్వేత ప్రవర్తనలో మార్పు రాలేదు. హిందూపూర్‌కు చెందిన సురేష్‌ అనే వ్యక్తితో ప్రేమయాణం కొనసాగించింది. ఈ విషయం భర్త చంద్రశేఖర్‌కు తెలిసి ఆమెను మందలించాడు.


ఈ విషయంపై ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది శ్వేత. 
ఎవరికీ డౌట్ రాకుండా కొత్త సిమ్ కార్డు తీసుకుంది. ఈ నెల 22న హత్యకు ప్లాన్ చేసుకుని.. సురేష్‌ను ఇంటికి పిలిపించింది. భర్త చంద్రశేఖర్ విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి రాగా.. ఇంట్లో నీళ్లు రావట్లేదని.. పైకి వెళ్లి ట్యాంక్ చూసి రావాలని చెప్పింది. అతను పైకి వెళ్లగానే.. సురేష్ ఇనుప రాడ్ తీసుకుని పైకి వెళ్లి తలపై బాదాడు. అనంతరం మర్మాంగం కత్తిరించి హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడు.


సమాచారం అందుకుని పోలీసులు ఇంటికి రాగా.. ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి తన భర్తను హత్య చేసి వెళ్లిపోయారంటూ పొంతన లేకుండా సమాధానం చెప్పింది. శ్వేతపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ప్రియుడు సురేష్‌తో కలిసి చంద్రశేఖర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Also Read: Mla Rohith Reddy Audio Leak: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సంచలన ట్విస్ట్.. రోహిత్ రెడ్డి ఆడియో లీక్..!  


Also Read: బీజేపీ మహిళా నేతలు ఐటెమ్స్... ఖుష్బూ పెద్ద ఐటెం.. అధికార పార్టీ నేత దారుణ వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook