Facebook Love: అతడికి 52.. ఆమెకు 25.. ఫేస్‌బుక్‌లో చిగురించిన ప్రేమ.. ఊహించని విషాదం
Nandyal Woman Death Case: ఇద్దరి మధ్య ఫేస్‌బుక్‌లో చిగురించిన ప్రేమ చివరికి ప్రాణం తీసుకునే వరకు వెళ్లింది. అప్పటికే అతడికి, ఆమెకు పెళ్లైనా మళ్లీ ప్రేమలో పడ్డారు. కానీ చివరికి విషాదం మిగిలింది.
Nandyal Woman Death Case: అతడి వయసు 52.. ఆమెకు 25.. అతను భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. ఆమె కూడా భర్తను వదిలేసి కుమారుడితో దూరం ఉంటోంది. వారిద్దరికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య మెసేజ్‌ల నుంచి ఫోన్ కాల్స్ వరకు వచ్చింది. కలిసి జీవిద్దామని అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇంతలో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఏం జరిగింది..? నంద్యాల జిల్లా దొర్నిపాడులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..
బాపట్ల జిల్లా నర్సయ్యపాలెం గ్రామానికి చెందిన భూషణం (52) భార్యను వదిలేసి దూరంగా ఉంటున్నాడు. అతనికి 20 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన హసీనా భర్త మద్యానికి బానిసయ్యాడు. ఆయనకు దూరంగా తన ఏడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భూషణానికి.. హసినాకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు సందేశాలు పంపించుకుని.. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.
రెండేళ్లుగా ఫోన్‌లో నిత్యం మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలోనే కలిసి జీవిద్దామని అనుకున్నారు. తన వద్దకు వచ్చేయాలని హసీనాకు భూషణం చెప్పడంతో ఆమె తన కుమారుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో హసీనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి హసీనాను తండ్రితో పాటు పంపించారు. భూషణాన్ని కూడా పంపించడంతో అతను బాపట్లకు వెళ్లిపోయాడు.
ఈ నెల 3న తహసీల్దార్ ఎదుట హసీనాను బైండోవర్ చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వగా.. ఆమె ఉదయం ఆరు గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం చివరికి ప్రాణం తీసుకునే వరకు వెళ్లడం విషాదకరమని స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
Also Read: HBD Virat Kohli: నాన్న కల.. అన్నకు ఇచ్చిన మాట.. విరాట్ కోహ్లీ జీవితంలో కన్నీటి గాథ
Also Read: Attack on Chandrababu Naidu: చంద్రబాబు నాయుడిపై రాళ్ల దాడి.. సీఎస్ఓ మధుబాబుకు గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి