HBD Virat Kohli: నాన్న కల.. అన్నకు ఇచ్చిన మాట.. విరాట్ కోహ్లీ జీవితంలో కన్నీటి గాథ

Virat Kohli Birthday Special: రికార్డుల రారాజు.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా కోహ్లీ జీవితంలోని ఓ కన్నీటి గాథ గురించి తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 08:32 AM IST
HBD Virat Kohli: నాన్న కల.. అన్నకు ఇచ్చిన మాట.. విరాట్ కోహ్లీ జీవితంలో కన్నీటి గాథ

Virat Kohli Birthday Special: అతను రాకముందు వరకు తెలియదు సెంచరీలు ఇంత సులువుగా చేయవచ్చా అని.. అతను క్రీజ్‌లో అడుగు పెట్టే వరకు తెలియదు క్రికెట్‌లో ఇలాంటి షాట్స్ కూడా ఆడొచ్చా అని.. రికార్డులు తన ఇంటి పేరుగా మార్చుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ.. టీమిండియా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల రారాజుగా.. రన్‌ మెషీన్‌గా మనమంతా ముద్దుగా పిలుచుకున్నా.. ఆ కష్టం వెనుక ఎన్నటికీ మర్చిపోలేని కన్నీటి సాగరం ఉంది. నేడు కోహ్లీ బర్త్ డే. ఈ సందర్భంగా కోహ్లీ జీవితంలో జరిగిన కీలక ఘట్టం గురించి తెలుసుకుందాం.. 

అది 2006 డిసెంబర్‌. అప్పుడు విరాట్ ఢిల్లీ రంజీ జట్టులో సభ్యుడు. నాలుగు రోజుల మ్యాచ్‌ కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలోనే ఓ చేదు వార్త. కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీకి తీవ్ర అనారోగ్యం. తండ్రిని తీసుకుని కుటుంబ మొత్తం హాస్పిటల్‌కు వెళ్లింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా కోహ్లీ తండ్రిని కాపాడలేకపోయారు. తండ్రి చివరి శ్వాస తీసుకోవడం చూసిన కోహ్లీకి కన్నీళ్లు అక్కడే ఆగిపోయాయి. కుటుంబం మొత్తం విలపిస్తున్నా.. అతను మాత్రం గుండె నిబ్బరం పట్టాడు. మరుసటి రోజు తాను బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

వెంటనే కోచ్‌కు ఫోన్ చేసి.. తాను ఆడుతున్నా అని చెప్పాడు. ఓవైపు తండ్రి మరణాన్ని తట్టుకుని వెళ్లి మ్యాచ్ ఆడాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచర ఆటగాళ్లు కోహ్లీని ఓదార్చే సమయంలో ఒక్కసారిగా బోరుమని ఏడ్చాడు. మ్యాచ్ తరువాత వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తన తండ్రి మరణం తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని.. కష్టాల్లో ఎలా పోరాడడం తనకు నేర్పిందని విరాట్ చెబుతుంటాడు. 

'నేను ఇండియా తరుపున ఆడాలనేది మా నాన్న కల. మా నాన్న మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆ కష్ట కాలం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆ రోజే భారత్‌కు ఆడతానని మా సోదరుడికి వాగ్దానం చేశాను. అప్పటి నుంచి నా జీవితంలో క్రికెట్ తరువాతే అన్ని. ఏ కారణంతో అయినా క్రికెట్‌ను విడిచిపెట్టకూడదని అనుకున్నా. మా తండ్రి మరణం నాకు కష్టకాలంలో పోరాడాలని నేర్పింది..' అంటూ కోహ్లీ గతంలో చెప్పుకొచ్చాడు. తండ్రి కలను.. అన్నయ్యకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని.. టీమిండియాకు ఒంటిచెత్తో ఎన్నో అద్భుత విజయాలు అందించిన కోహ్లీ.. మరెన్నో రికార్డులు అందుకుని భారత క్రికెట్‌లో ఎవర్ గ్రీన్‌ ప్లేయర్‌గా నిలిచిపోవాలని కోరుకుంటూ జీ తెలుగు న్యూస్ తరుఫున.. కోట్లాది మంది అభిమానుల తరుఫున హ్యాపీ బర్త్ డే కింగ్ కోహ్లీ.

కోహ్లీ కెరీర్..

1988 నవంబరు 5న ఢిల్లీలో జన్మించాడు విరాట్ కోహ్లీ. టీమిండియాలోకి 2008లో అరంగేట్రం చేశాడు. విరాట్‌కి నేటితో 34 ఏళ్లు. కోహ్లీ ఇప్పటివరకు 102 టెస్టులు, 262 వన్డేలు, 113 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 27 టెస్టులు, 28 హాఫ్ సెంచరీలతో 8074 పరుగులు, వన్డేల్లో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 12,344 పరుగులు చేశాడు. అతను అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 36 అర్ధ సెంచరీలతో 3,932 రన్స్ చేశాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో మూడు హాఫ్ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు.

Also Read: LYCA Productions New Movie : లైకా ట్వీట్.. ఎవరితో సినిమా?.. విజయ్, అజిత్, తలైవా ఫ్యాన్స్ రచ్చ

Also Read: King Cobra Python Viral Video: గెలికి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకున్న కింగ్ కోబ్రా.. కొండచిలువ పట్టు మాములుగా లేదుగా!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News