Zomato Delivery Boy: జొమాటో ఫుడ్ డెలివరి బాయ్ మహిళా కస్టమర్‌కి బలవంతంగా ముద్దులు పెట్టాడన్న వార్త సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. పూణెలో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి.. యువతిని మంచి నీళ్లు కావాలన్న వంకతో దగ్గరికి లాక్కుని రెండు చెంపలపై బలవంతంగా ముద్దులు పెట్టాడని ఆరోపణలు రావడంతో జొమాటో మరోసారి వార్తల్లోకెక్కింది. దీంతో వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని టెన్షన్ పడిన జొమాటో చివరకు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ ఘటనపై స్పందించక తప్పలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూణె ఘటనలో కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులకు తాము విచారణకు సహకరిస్తున్నామని చెప్పిన జొమాటో.. ఈ కేసులో నిందితుడిగా వ్యక్తి అసలు జొమాటో బాయ్ కానే కాదని స్పష్టంచేసింది. ఫుడ్ డెలివరీ బాయ్స్‌ని నియమించుకునే ముందే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయిస్తామని.. లైంగిక వేధింపుల విషయంలో తాము జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తామని జొమాటో వివరణ ఇచ్చింది. 


ఇదిలావుంటే, ఈ ఘటనలో జొమాటో చెబుతున్న వివరణ, బాధితురాలి ఫిర్యాదు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయగా.. రాయిస్ షేక్ అనే వ్యక్తి ఆ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చాడు. తాగడానికి వాటర్ అడిగితే... ఇచ్చాను. అదే సమయంలో.. తనను దగ్గరికీ లాక్కుని గట్టిగా పట్టుకుని రెండు చెంపలపై ముద్దులు పెట్టాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కానీ జొమాటో మాత్రం నిందితుడు రాయిస్ షేక్ తమ జొమాటో డెలివరి పార్ట్‌నర్ కానే కాదని వాదిస్తోంది. 



ఈ కేసులో అరెస్ట్ అయిన 40 ఏళ్ల రాయిస్ షేక్.. బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం పూణె పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు. ఈ కేసులో నిజానిజాల సంగతెలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఫుడ్ డెలివరీతో పాటు రెండు ముద్దులు ఫ్రీ అంటూ కొన్ని మీమ్స్.., ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో జాగ్రత్త అంటూ ఇంకొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దర్యాప్తులో ఈ కేసు ఇంకే మలుపు తిరగనుందో వేచిచూడాల్సిందే మరి.


Also Read : Teacher, Student Suicide: స్కూల్ టీచర్, 17 ఏళ్ల స్టూడెంట్ లవ్ ఎఫైర్.. చివరకు..


Also Read : Minor Girl Rape Case: స్కూల్ బస్సులో దారుణం.. చిన్నారిపై డ్రైవర్ అరాచకం.. మహిళా అటెండెంట్ కూడా బస్సులోనే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి