Teacher, Student Suicide: స్కూల్ టీచర్, 17 ఏళ్ల స్టూడెంట్ లవ్ ఎఫైర్.. చివరకు..

Teacher, Student Affair:ఓ స్కూల్ టీచర్, అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని అడివిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వీరేంద్ర.. అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2022, 09:21 PM IST
Teacher, Student Suicide: స్కూల్ టీచర్, 17 ఏళ్ల స్టూడెంట్ లవ్ ఎఫైర్.. చివరకు..

Teacher, Student Affair: ఓ స్కూల్ టీచర్, అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని అడివిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.  ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రసూల్‌పూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వయస్సు 40 ఏళ్లు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వీరేంద్ర.. అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. గ్రామస్తులు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం వీళ్లిద్దరూ ఎఫైర్‌లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి వీళ్లిద్దరూ కనిపించకుండా పోవడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. 

టీచర్ వీరేంద్రతో పాటు విద్యార్థిని కూడా అదృశ్యమయ్యిందనే వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. ఓవైపు తమ కూతురు కనిపించకుండా పోయిందనే ఆందోళన.. మరోవైపు టీచరే విద్యార్థిని తీసుకెళ్లిపోయాడన్న ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు ఆ తల్లిదండ్రులను మరింత మనోవేధనకు గురిచేశాయి. తమ కూతురిని టీచర్ కిడ్నాప్ చేశాడంటూ ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

టీచర్, విద్యార్థిని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసినప్పటికీ.. తరచుగా లొకేషన్ మారుస్తూ పోవడంతో వారిని పట్టుకోవడం కష్టమైంది. సమీపంలోని అడవిలోంచి ఏదో కుళ్లిన దుర్వాసన వస్తోందని తెలియడంతో పోలీసుల బృందం అక్కడికి వెళ్లి చూసింది. అక్కడ కనిపించిన సీన్ చూసిన పోలీసులు షాకయ్యారు. తాము గాలిస్తున్న స్కూల్ టీచర్, విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించారు. ఇద్దరి శవాలు కూడా బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సహరాన్‌పూర్ జిల్లా సీనియర్ ఎస్పీ విపిన్ తడ తెలిపారు. విద్యార్థిని కిడ్నాప్ కేసు కాస్తా విషాదాంతం అవడంతో రసూల్‌పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Also Read : Prostitution Racket in Hyderabad: అపార్ట్‌మెంట్‌లో సెక్స్ రాకెట్.. సినిమా వాళ్లు ఉన్నట్లు అనుమానాలు

Also Read : Khammam: లిఫ్ట్‌ పేరుతో ఇంజెక్షన్‌ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News