Bhopal Minor Girl Rape Case: స్కూల్ బస్సులో దారుణం.. చిన్నారిపై డ్రైవర్ అరాచకం.. మహిళా అటెండెంట్ కూడా బస్సులోనే..

Minor Girl Rape Case In Bhopal: స్కూల్ బస్సులో బడికి వెళ్లి వస్తున్న మూడున్నరేళ్ల నర్సరీ చిన్నారిపై అదే స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే వార్త చిన్నారుల తల్లిదండ్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. 

Written by - Pavan | Last Updated : Sep 13, 2022, 04:53 PM IST
  • స్కూల్ బస్సులో చిన్నారిపై డ్రైవర్ అఘాయిత్యం..
  • ఆ సమయంలో మహిళా అటెండెంట్ కూడా బస్సులోనే..
  • ఈ దారుణం ఎలా వెలుగులోకొచ్చిందంటే..
Bhopal Minor Girl Rape Case: స్కూల్ బస్సులో దారుణం.. చిన్నారిపై డ్రైవర్ అరాచకం.. మహిళా అటెండెంట్ కూడా బస్సులోనే..

Bhopal Minor Girl Rape Case: కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు అని కూడా చూడకుండా పసిపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడి వారి జీవితాలను చిద్రం చేస్తున్నారు. భోపాల్‌లో చోటుచేసుకున్న దారుణమైన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. స్కూల్ బస్సులో బడికి వెళ్లి వస్తున్న మూడున్నరేళ్ల నర్సరీ చిన్నారిపై అదే స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే వార్త చిన్నారుల తల్లిదండ్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. భోపాల్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. చిన్నారిపై అత్యాచారం జరిగిన సమయంలో నిందితుడితో పాటు బస్సులో మహిళా అటెండెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 

చిన్నారిపై లైంగిక దాడి ఎలా వెలుగులోకొచ్చిందంటే..
భోపాల్‌లోనే పేరున్న ఓ ప్రైవేటు కార్పొరేటు స్కూల్‌లో బాధిత చిన్నారి నర్సరీ చదువుకుంటోంది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన చిన్నారి స్కూల్ బ్యాగులో అదనంగా పెట్టి పంపించిన బట్టలు ధరించి కనిపించింది. దీంతో ఆ బట్టలు ఎవరు మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ చిన్నారి తల్లి స్కూల్లో క్లాస్ టీచర్‌ని, ప్రిన్సిపాల్‌ని ఎంక్వైరీ చేసింది. స్కూల్లో ఎవ్వరూ చిన్నారి బట్టలు మార్చలేదనే సమాధానమే వచ్చింది. అంతలోనే తన ప్రైవేటు పార్ట్స్‌లో నొప్పిగా ఉందంటూ ఆ చిన్నారి ఏడుస్తూ తల్లికి చెప్పింది. దీంతో ఏదో జరగకూడనిదే జరిగిందని భావించిన చిన్నారి తల్లిదండ్రులు.. అసలు బట్టలు ఎవరు మార్చారు, ఏమైంది అని అడిగారు. అప్పుడు చిన్నారి నోరు విప్పి అసలు విషయం చెప్పుకొచ్చిందని.. డ్రైవర్ తనపై వేధింపులకు పాల్పడి అతడే బట్టలు మార్చినట్టు చిన్నారి పూసగుచ్చినట్టు చెప్పడంతో అసలు విషయం బయటికొచ్చిందని పోలీసులు తెలిపారు. 

బస్సులోనే అత్యాచారం.. మహిళా అటెండెంట్ కూడా బస్సులోనే..
మరుసటి రోజు చిన్నారిని వెంటపెట్టుకుని స్కూల్‌కి వెళ్లిన తల్లిదండ్రులు.. చిన్నారికి జరిగిన అన్యాయంపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసి నిలదీశారు. బాధిత చిన్నారి సైతం తనపై అఘ్యాయిత్యానికి ఒడిగట్టిన చిన్నారిని గుర్తించింది. స్కూల్ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో మహిళా అటెండెంట్ కూడా బస్సులోనే ఉందంటూ చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన డ్రైవర్‌తో పాటు అతడికి సహకరించిందనే నేరం కింద సదరు మహిళా అటెండెంట్‌ని కూడా అరెస్ట్ చేశారు.  

ఏసీపీ నిధి సక్సెనా మీడియాతో మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్ 376-ఏబీతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగం చేశామని.. ప్రస్తుతం నేరం జరిగిన ప్రదేశాన్ని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. చిన్నారిని వైద్య పరీక్షలు నిమిత్తం పంపించామని.. ప్రస్తుతం మెడికల్ రిపోర్టు కోసం వేచిచూస్తున్నట్టు నిధి సక్సెనా తెలిపారు.

Also Read : Kakinada: చనిపోయిన 59 రోజులకు అసలు విషయం బయటపడింది.. చంపింది భార్యే.. పక్కా స్కెచ్..

Also Read : Crime News: తండ్రితో పెళ్లికి నిరాకరించిందని యువతి బట్టలు విప్పి, జుట్టు కత్తిరించి బూట్లు నాకించిన వైనం.. ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News