కోలీవుడ్‌లో అందరి కన్నా చిన్న వయసున్న సంగీత దర్శకుడు అనిరుధ్ అన్న విషయం మనకు తెలిసిందే. తెలుగులో పవన్ కళ్యాణ్ చిత్రం అజ్ఞాతవాసికి సంగీతం అందిస్తున్న ఈ యువ సంగీత దర్శకుడు ప్రస్తుతం మరో రికార్డు నమోదు చేశాడు. తాను మ్యూజిక్ అందించిన ‘తానా సెరిందా కొట్టం’ అనే తమిళ సినిమాలో ‘సొడక్కు మేలా’ అనే సాంగ్‌ను అనిరుధ్ కంపోజ్ చేయగా, అది ఇప్పుడు యూట్యూబ్‌లో కోటిమంది వీక్షకులను నమోదు చేసిందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ధనుష్ ‘కొలవరిడీ’ పాట తర్వాత అంత పాపులారిటీని ప్రస్తుతం ఈ పాట తమిళనాడులో సంపాదించుకుందట. ఇదే విషయాన్ని అనిరుధ్ పంచుకుంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ సాంగ్‌ను పాడుతున్న హీరో సూర్య, డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్, నటి రమ్యక్రిష్ణ తదితరుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 



 <>