Simbu film Budget: శింబు కెరీర్లో 100 కోట్లతో సినిమా.. కమల్ హాసన్ లెక్క మామూలుగా లేదు!
Simbu film Budget :శింబు తాజాగా తన 48వ సినిమా కమల్ హాసన్ నిర్మాణంలో ఆయన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద నిర్మితమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది.
100 Crores Budget for Simbu film: తమిళ స్టార్ హీరో శింబు గత కొన్నాళ్ల నుంచి వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు కానీ ఈ మధ్యనే వరుస హిట్లు అందుకుంటూ దూసుకు వెళ్తున్నారు. ఇక శింబు తాజాగా తన 48వ సినిమా కమల్ హాసన్ నిర్మాణంలో ఆయన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద నిర్మితమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని నిన్న అధికారికంగా వీడియో రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.
ఇక లోకనాయకుడిగా భావించే కమల్ హాసన్ నిర్మాణంలో శింబు సినిమా చేస్తున్నాడనే విషయం తెలిసి అటు కమల్ అభిమానులు ఇటు శింబు అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి భారీగా బడ్జెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. కేవలం పేపర్ మీద అనుకున్న బడ్జెట్ 100 కోట్లు అని తెలుస్తోంది. షూటింగ్ కి వెళ్ళిన తర్వాత అది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ రకంగా చూస్తే శింబు కెరియర్లో ఎస్టిఆర్ 48గా సంభోదించబడుతున్న ఈ సినిమా అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిస్తున్న సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని 'కన్నుమ్ కన్నుమ్ కొల్లై ఆదితాల్' దర్శకుడు దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి అనిరుద్ కానీ ఏఆర్ రెహమాన్ కానీ సంగీతం అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ మాత్రమే కాకుండా మరో రెండు నిర్మాణ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలైతే అందాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇక శింబు హీరోగా నటిస్తున్న పత్తు తాల మార్చి 30వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతానికి శింబు వెకేషన్ కోసం థాయిలాండ్ వెళ్లారు వచ్చిన వెంటనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించి ఆ వెంటనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.
Also Read: Naresh Clarity on Marriage: పవిత్ర పెళ్లిపై తొలిసారి స్పందించిన నరేష్.. మామూలుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి