Nagababu Questions Tammareddy Bharadwaja: ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ విషయం మీద క్లారిటీ ఇస్తూ తమ్మారెడ్డి భరద్వాజ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎవరినీ కించపరచాలని ఉద్దేశం లేదని రాజేష్ టచ్ రివర్ అనే డైరెక్టర్ ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో తాను ఈ మేరకు కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. సినిమాలు రెండు రకాల అని చెప్పానని ఒకటి అవార్డు సినిమా రెండోది రివార్డు సినిమా అని ఆ వర్క్ షాప్ వచ్చిన వారికి చెప్పానని అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పా అదే 80 కోట్లు నా దగ్గరుంటే నేను పది సినిమాలు తీస్తాను అన్నాను, నేను రెండున్నర గంటల పాటు అక్కడ మాట్లాడితే అది మొత్తం వినకుండా ఒక చిన్న నిమిషం బిట్టు పట్టుకొచ్చి నాపై అబాండాలు వేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. సరే నేను మాట్లాడిన మాటలు నచ్చని వారు సైతం నా మాటలను ఖండించవచ్చు కానీ దారుణమైన విధంగా నన్ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటూ తమ్మారెడ్డి భరద్వాజ వీడియో విడుదల చేశారు.
అయితే నిన్న రాత్రి కేవలం ట్వీట్ పెట్టి వదిలేసిన నాగబాబు తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలకు ఈసారి వీడియో ముఖంగా సమాధానం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్స్ కి వెళ్లడానికి 80 కోట్లు ఖర్చు పెట్టారా? మీరు దగ్గరుండి లెక్కలు చూశారా? మీరు దగ్గరుండి ఆడిటర్ ని అడిగి చూశారా? అని ప్రశ్నించారు. మీరు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమా గురించి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకుంటారా? ఆ రాజమౌళో, కీరవాణి మాకెందుకులే అని సైలెంట్ గా ఉండొచ్చు.
అయినా మనం ఒక సినిమాను, మంచిగా ఆ సినిమాను చూసి జబ్బులు చర్చుకుని గర్వంగా ఉండాలి కానీ విమర్శిస్తామా? ఇదే సినిమాని ఏదైనా ఛానల్లో లేక జర్నలిస్టు సినిమా క్రిటిక్కో విమర్శించాడు అంటే సరే అనుకోవచ్చు, అది వాళ్ళ జీవన భృతి అనుకుంటాం. కానీ మీకేం సంబంధం? చెప్పు. వీలైతే మెచ్చుకోవాలి లేదా సైలెంట్ గా ఉండాలి, కుళ్ళు ఉంటుంది కదా కొంతమందికి సైలెంట్ గా ఉండండి, మీ కుళ్ళుని మీ విషాన్ని బయట పెట్టడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించాడు. అయినా తమ్మారెడ్డి భరద్వాజ నువ్వు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశావు? ఒక్క సినిమా కైనా హీరో, హీరోయిన్లకు రెమ్యూనరేషన్ సరిగ్గా ఇచ్చావా? ఆర్ఆర్ఆర్ సినిమా మీద నీకు ఎందుకు ఇంత కక్ష అంటూ నాగబాబు ప్రశ్నించారు.
Also Read: Tammareddy Bharadwaja Clarity: ఆర్ఆర్ఆర్ కామెంట్లపై తమ్మారెడ్డి క్లారిటీ.. అసలు విషయం ఇదే అంటూ!
Also Read: Rana Naidu Streaming: ఆలస్యంగా నెట్ ఫ్లిక్స్ లోకి 'రానా నాయుడు'.. వాళ్లతో కలిసి చూడకండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి