OTT Movies: ఈ వారం ఓటీటీలో 32 సినిమాలు స్ట్రీమింగ్, ఏ సినిమాలు ఎందులో
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం పెద్దఎత్తున ఓటీటీలో సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చాలా ఉన్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం.
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ ముందే నిర్ణయమౌతోంది. కొన్ని చిన్న చిన్న సినిమాలైతే నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. అందులో భాగంగా ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
అన్ని రకాల సినిమాలు, వివిధ భాషల్లో కంటెంట్, మంచి ఎంటర్‌టైన్‌మెంట్, నచ్చినప్పుడు నచ్చినట్టుగా నచ్చిన భాషలో చూసే అవకాశముండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో ఓటీటీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందులో భాగంగా ఈ వారం దాదాపు 32 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో..
డిసెంబర్ 4న డ్యూ డ్రాప్ డైరీస్ సీజన్ 2 వెబ్‌సిరీస్, డిసెంబర్ 5న స్టావ్రోస్ హల్కైస్-ఫాట్ రాస్కెల్, డిసెంబర్ 6న బ్లడ్ కోస్ట్, క్రిస్మస్ యాజ్ యూజ్‌వెల్, డిసెంబర్ 7న అనలాగ్ స్క్వాడ్, హై టైడ్స్, హిల్టా సీజన్ 3, ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2. మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్, సుజాన్నా-మల్ జుమాత్ క్లివాన్, ద ఆర్బీస్, వరల్డ్ వార్ 2-ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్, దక్ దక్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక డిసెంబర్ 5న జిగర్ తాండ్ డబుల్ ఎక్స్, లీవ్ ద వరల్డ్ బిహైండ్ విడుదలవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో..
డిసెంబర్ 7న డేటింగ్ శాంటా, మన్ పసంద్, డిసెంబర్ 8న మస్త్ మైన్ రహానే కా, మేరీ లిటిల్ బ్యాట్ మ్యాన్, యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 విడుదలవుతున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో
డిసెంబర్ 6న సౌండ్ ట్రాక్ 2, డిసెంబర్ 7న ది ఇంట్రెస్టింగ్ బిట్స్, డిసెంబర్ 8న డైరీ ఆఫ్ ఎ వింపీ కీడ్ క్రిస్మస్, వధువు, ద మిషన్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక సోనీలివ్‌లో డిసెంబర్ 7న చమక్ , జీ5లో డిసెంబర్ 8న కడక్ సింగ్, కూసే మునిస్వామి వీరప్పన్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమాలో డిసెంబర్ 10న స్కూబీ డూ అండ్ క్రిస్టో టూ స్ట్రీమింగ్ కానుంది. ః
Also read: Bigg Boss 07 Telugu: బిగ్ బాస్ నుంచి డాక్టర్ బాబు ఎలిమినేట్.. శివాజీతో గొడవే కారణమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook