Tamil actor karunas found with 40 Bullets: కొన్నిరోజులుగా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది నటీ, నటులు వివాదాస్పదంగా ప్రవర్తించి, వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును బెంగళూరు పోలీసులు ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. ఇక ఈ ఘటనలో తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమ కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె బ్లడ్ సాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా బైటపడింది. ఈ క్రమంలో.. దేశంలో ఒక వైపు ఎన్నికల ఫలితాల టెన్షన్, మరోవైపు వరుసగా ఇండస్ట్రీకి సంబంధించిన వివాదస్పద  అంశాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఫేమస్ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బుల్లెట్లతో అడ్డంగా దొరికిపోయారు. తమిళ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ తిరుచ్చి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.   ఎయిర్ పోర్ట్ సిబ్బంది తనిఖీలు చేపట్టగా.. ఆయన బ్యాగులో 40 వరకు బుల్లెట్లు బైటపడ్డాయి. వెంటనే పోలీసులు దీనిపై ఆరా తీశారు. అయితే.. కరుణాస్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అది లైసెన్స్ కల్గిన తుపాకీ అని, బుల్లెట్ లు కూడా దానికి సంబంధించినవేనంటూ  చెప్పారు. గన్ కు సంబంధించిన పత్రాలను కూడా ఎయిర్ పోర్టు సిబ్బందికి చూపించారు. పోలీసులు కూడా ఆ పత్రాలను పరిశీలించారు. అయితే,  కరుణాస్ తన రక్షణ కోసం లైసెన్స్‌తో కూడిన తుపాకీని కలిగి ఉన్నాడని పోలీసు అధికారులకు చెప్పాడు.


 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున తుపాకీని డిండిగల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని, అయితే ప్రమాదవశాత్తు బుల్లెట్లు మాత్రం తన బ్యాగులోనే ఉండిపోయాయని క్లారిటీ ఇచ్చారు. కరుణాస్ తన తుపాకీని డిండిగల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు, ధృవీకరించే పత్రాలను కూడా చూపించాడు.


Read more; Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..


భద్రతా సిబ్బంది,  దిండిగల్ పోలీస్ స్టేషన్‌ వారితో మాట్లాడి నటుడి వాదన పట్ల ఏకీభవించారు. ఈ నేపథ్యంలో కరుణాస్ ను తిరుచ్చి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గతంలో కరుణాస్‌ అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరువాడనై నియోజకవర్గంలో  2016 నుంచి 2021 వరకు శాసనసభ్యుడిగా కొనసాగినట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter