Prabhas : ప్రభాస్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు. అందుకే ఆయన్ని మనమందరం డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటాం. మన డార్లింగ్ బాహుబలి సినిమాతో ప్రపంచానికే రెబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. కాగా అంత పెద్ద స్టార్ అయినా కానీ ప్రభాస్ ఇప్పటికీ తన అభిమానులకు డార్లింగ్ గానే కనిపివ్వడం ఆయన నిజంగా ఎక్కడున్నా రాజే అన్న విషయం చెప్పకనే చెబుతుంది. మరి అలాంటి మన డార్లింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనం తప్పక తెలుసుకోవలసిన పది ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. కానీ మనకు మాత్రం ప్రభాస్ గా పరిచయమయ్యారు. 44 ఏళ్ల క్రితం ఇదే రోజున సినీ నిర్మాత యు.సూర్యనారాయణ రాజు, శివ కుమారి దంపతులకు ప్రభాస్‌ జన్మించారు.


అతనికి ప్రమోద్ ఉప్పలపాటి అనే అన్నయ్య, ప్రగతి అనే అక్క ఉన్నారు. ముక్కరిలోకి ప్రభాస్ చిన్నవాడు. ఇక ప్రభాస్ పెదనాన్న మరెవరు కాదు మన రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. భీమవరంలోని డిఎన్‌ఆర్ స్కూల్‌లో విద్యను పూర్తి చేసిన ప్రభాస్ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందాడు.


ప్రభాస్ తన బాహుబలి సినిమా కోసం మొత్తం ఐదు సంవత్సరాలు పనిచేశాడు. దాదాపు 600 రోజులు షూటింగులో పాల్గొందారు. 


ప్రభాస్ గురించి చాలామందికి తెలియని మరో విషయం ఏమిటి అంటే ప్రభాస్ బాలీవుడ్ చిత్రం 'యాక్షన్ జాక్సన్'లో అతిధి పాత్రలో కనిపించాడు.


ప్రభాస్ ఎప్పుడు హీరో అవ్వాలి అనుకోలేదు కదా. ఆయనకి ఎక్కువగా కేటరింగ్ వ్యాపారంలో మనసు ఉండడంతో హోటల్ నడపాలనుకున్నాడట. తాను నటుడిని కావాలని ఎప్పుడూ ఆలోచించలేదని, బదులుగా, తాను హోటల్ బిజినెస్ చేయటం ఇష్టపడతానని ప్రభాస్ గతంలో చెప్పాడు. ఆహార ప్రియుడైన ప్రభాస్, చికెన్ బిర్యానీ వెరైటీస్ ఉండే ఒక హోటల్ ఓపెన్ చేయాలని అనుకున్నారట. ఎందుకంటే ప్రభాస్ కి చాలా ఇష్టమైన ఆహారం చికెన్ బిర్యానీ ఇక రొయ్యలు.


ప్రభాస్ కి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, దాదాపు 20 సార్లు చూసాను అని చెప్పుకొచ్చారు ప్రభాస్.


ప్రభాస్ కి వాలీబాల్ ఆడదం అంతే చాలా ఇష్టం. అందుకే మన డార్లింగ్ తన ఇంట్లోనే ఒక వాలీబాల్ కోర్టుని కూడా ఏర్పాటు చేసుకున్నారు.


ప్రభాస్ కి చాలా ఇష్టమైన వెకేషన్ స్టార్ట్ యూరప్. సినిమా షూటింగుల మధ్యలో గ్యాప్ దొరికితే ఎక్కువగా ప్రభాస్ యూరప్ కి వెళ్లడానికి ఇష్టపడతారు.


ప్రభాస్ కెరియర్లు మొదటిసారి సూపర్ హిట్ సినిమా వర్షం ఇచ్చిన డైరెక్టర్ శోభన్  హఠాత్తుగా మరణిస్తే అతను కొడుకు బాధ్యతలను ప్రభాస్ తీసుకున్నారు.
సంతోష్ శోభన్ సినీ కెరీర్ని గాడి పెట్టేందుకు ప్రభాస్ తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. అలాగే తన స్నేహితులతో కలిసి UV క్రియేషన్ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.