Naatu Naatu Oscar nominations భారతీయులు తీసిన సినిమాలు, కేవలం భారతీయులు పని చేసిన చిత్రాలకు ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. ఇంగ్లీష్‌ సినిమాలకు పని చేసిన ఇండియన్స్‌కు అవార్డు వచ్చింది కానీ.. పూర్తి దేశీ చిత్రానికి మాత్రం ఇంత వరకు కూడా ఆస్కార్ అవార్డు రాలేదు. తొలిసారిగా ఆ అవకాశం వచ్చింది. ఓ ఇండియన్ అందులోనూ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చే చాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ ఒక్క అడుగు దూరంలోనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నాటు నాటు పాటకు ఆస్కార్ రావాలని దేశమంతా కోరుకుంటోంది. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమన్ స్పందించాడు. గోల్డెన్ గ్లోబ్ వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నాటు నాటు ఆస్కార్ నామినేషన్లోకి వచ్చిన సమయంలోనూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నాడు. అయితే ఈ వ్యాఖ్యల మీద ఓ నెటిజన్ ఇలా స్పందించాడు.


 



మా తమిళ వాళ్లు ఇలా తెలుగు వాళ్ల మీద ప్రేమను కురిపిస్తారు.. ఆస్కార్ అవార్డు రావాలని ఇలా కోరుకుంటున్నారు.. కానీ వాళ్లకి మాత్రం తమిళ వాళ్లు అంటే ద్వేషం అని ఇలా నెటిజన్ ట్వీటేశాడు. దీనిపై ఏఆర్ రెహమాన్ స్పందించాడు. మనమంతా కూడా ఒక కుటుంబం.. మన అందరికీ మనస్పర్థలు రావొచ్చు.. ఉండొచ్చు.. కానీ ఒకరికొకరం సాయంగా ఉండాలి.. అండగా నిలబడాలి అంటూ ట్వీట్ వేశాడు.


కోలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరగుతూనే ఉంటుంది. అక్కడ విజయ్ ఫ్యాన్స్, ఇక్కడ మహేష్‌ బాబు అభిమానుల మధ్య ఎప్పుడూ సోషల్ మీడియా వార్ జరుగుతూనే ఉంటుంది. ఇలా అభిమానుల మధ్య లేనిపోని వాగ్వాదాలు, గొడవలు జరుగుతుంటాయి. కానీ మన హీరోలు, తమిళ హీరోలు అంతా కలిసిమెలిసి ఉంటారు. 


Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి