Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్​ బాబు, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా టీజర్ వచ్చేసింది. ఈ సినిమాలో సుధీర్​ బాబు (Sudheer Babu new movie).. సినిమా డైరెక్టర్​గా కనిపించగా.. కృతి శెట్టి కళ్ల డాక్టర్​గా (Krithi Shetty new Movie) కనిపించనున్నట్లు టీజర్​లో రివీల్ అయ్యింది. రొమాంటిక్​ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు కూడా అర్థమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్​ను ఓ సారి పరిశీలిస్తే..


ఈ సినిమాలో హీరో (సుధీర్​బాబు) ఓ సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​. ఆరేళ్లలో ఆరు సూపర్ హిట్​ సినిమాలు తీస్తాడు. అయితే తనతో ఉండే వాళ్లే తన సినిమాను విమర్శిస్తారు. అన్ని సినిమాల్లో అనాద అయిన హీరో.. బుర్ర, బట్టలు లేని హీరోయిన్​, అర్థం లేని పాటలు అని ఎగతాలి చేస్తారు.


అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్​ మాత్రం ఓ అందమైన ప్రిన్సెస్​ లాంటి అమ్మాయి చుట్టు జరిగే కథ తీయాలని నిర్ణయించుకుంటాడు. 'ఇన్నాళ్లు నన్ను నేను అమ్ముకుని సినిమా తీశాను.. ఈ సినిమా మాత్రం నన్ను నేను నమ్ముకుని తీస్తా'నని డైరెక్టర్​ దృఢంగా నిర్ణయించుకుంటాడు.


అందుకోసం హీరోయిన్​ను వెతికే క్రమంలో కృతి శెట్టిని చూస్తాడు హీరో. అయితే ఆమెకు సినిమాలంటే ఇష్టం లేదని చెబుతుంది. కానీ హీరో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.


అయితే ఎట్టకేలకు కృతి శెట్టి.. సుధీర్ బాబుతో సినిమా తీసేందుకు ఒప్పుకుంటుంది. కానీ ఓ కండీషన్​ పై మాత్రమే సినిమా తీస్తానని చెబుతుంది. మరి ఆ కండీషన్ ఏమిటి? ఇంతకీ ఆ అందమైన అమ్మాయి కథలో ఏముంది? ఆ కథ ప్రభావం డైరెక్టర్​, డాక్టర్లయిన సుధీర్​ బాబు, కృతి శెట్టిలపై ఎలా ఉంటుంది?


ఈ విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.



మరిన్ని వివరాలు..


ఈ సినిమాకు మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti new Movie) దర్శకత్వం వహించారు. కథ కూడా ఆయన రాసుకున్నారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషించారు.


బెంచ్ మార్క్​ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మహేంద్ర బాబు, కిరణ్​ బెల్లపల్లి నిర్మాతలు. మార్తాండ్​ కె వెంకట్​ ఎడిటర్​గా ఉన్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.


Also read: Shehnaaz Gill: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న షెహనాజ్ గిల్


Also read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక ప్రకటన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook