Aa Okkati Adakku Movie Review: `ఆ ఒక్కటి అడక్కు` మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?
Aa Okkati Adakku Movie Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆ ఒక్కటి అడక్కు`.చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
రివ్యూ: ఆ ఒక్కటి అడక్కు (Aa Okkati Adukku)
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, అరియానా గ్లోరి, హర్ష చెముడు, రాజా తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కే ప్రసాద్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: గోపీచందర్
నిర్మాత: రాజీవ్ చిలక
దర్శకత్వం: మల్లి అంకం
విడుదల తేది: 3-5-2024
అల్లరి నరేష్ తన కెరీర్ స్పాన్‌లో ఎక్కువగా కామెడీ చిత్రాలే ఎక్కువ చేసారు. ఆ మధ్య కొన్ని సీరియస్ సబ్జెక్ట్స్‌తో మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్ కామెడీ ఎంటర్టేనరర్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా ఒకప్పుడు తన తండ్రి ఇవివి సత్యనారాయణ.. రాజేంద్ ప్రసాద్‌తో చేసిన బ్లాక్ బస్టర్ టైటిల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా మారాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
గణపతి (అల్లరి నరేష్) ఓ గవర్నమెంట్ ఎంప్లాయి. ప్రభుత్వ ఉద్యోగం ఉండటంతో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఎక్కడా సంబంధం కుదరదు. ఈ నేపథ్యంలో ఓ మ్యాట్రిమోనీని సంప్రదిస్తాడు. అది సిధీ (ఫరియా అబ్దుల్లా)కు సంబంధించిన మ్యాట్రిమోనీ. అయితే గణపతి ఆమె పై ప్రేమను పెంచుకుంటాడు. ఆమెకు ప్రపోజల్ చేసే సమయానికి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది గణపతికి. మరి గణపతి చివరకు ఒకింటివాడు అయ్యాడా ? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన 'మల్లిశ్వరి' సినిమా కథను కాస్త పోలి ఉంది. తెలుగులో పెళ్లి కానీ ప్రసాద్ తరహా కథలు ఆ తర్వాత కుప్పలు కుప్పలుగా వచ్చాయి. దర్శకుడు మల్లి అంకం 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా కోసం అదే తరహా పాయింట్‌ను చూజ్ చేసుకున్నాడు. అందులో వెంకటేష్ బ్యాంకు ఉద్యోగి. ఇందులో అల్లరి నరేష్ పాత్ర కూడా దాదాపు తరహా ప్రభుత్వ ఉద్యోగి. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్లకు పెళ్లి ఈజీగానే అవుతోంది. అటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు పెద్దగా ప్రాబ్లెమ్ లేదు. మిగతా ఉద్యోగం చేసే వాళ్లకు పెళ్లి అనేది పెద్ద ప్రహసనం అని చెప్పాలి. ముఖ్యంగా డబ్బున్న ధనవంతులు.. అటు లోయర్ క్లాస్ వాళ్లకు పెళ్లి విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. కానీ మిడిల్ క్లాస్‌లోనే ఈ పెళ్లి ఇబ్బందులంతా. ఇక దర్శకుడు తాను చెప్పాల్సిన విషయాన్ని ఏదైనా కొత్త పాయింట్‌తో చెప్పాడా అంటే అది లేదు. ఏదో కొన్ని సీన్స్ నవ్వుకోవడానికి తప్పించి ఈ సినిమాలో పెద్దగా విషయం లేదు. కామెడీతో మొదలు పెట్టి సీరియస్ జానర్లోకి వెళ్లడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇంటర్వెల్ వరకు ఎలాగో అలా లాక్కొచ్చి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చేతులెత్తేసాడు దర్శకుడు. మొత్తంగా అల్లరి నరేష్ సినిమా చూడాలనుకునేవాళ్లకు ఇది పెద్ద డిజాప్పాయింట్‌కు గురి చేస్తోంది ఈ సినిమా. చివర్లో ఇచ్చిన సందేశం పర్వాలేదు. కెమెరావర్క్ విషయానికొస్తే.. ఉన్నంతలో పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీ సుందర్ మ్యూజిక్ పర్వాలేదు.
నటీనటుల విషయానికొస్తే..
అల్లరి నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది దర్శకులపై ఆధారపడి ఉంటుంది. మరోసారి ఉన్నంతలో అల్లరి నరేష్ నవ్వించే ప్రయత్నం చేసాడు. ఫరియా అబ్దుల్లా తన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ యాక్టింగ్ నవ్విస్తోంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
ప్లస్ పాయింట్స్
అక్కడక్కడ నవ్వించే సీన్స్
ఫస్టాఫ్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
పంచ్ లైన్.. కామెడీ కోరుకునే ప్రేక్షకులు 'ఆ ఒక్కటి అడక్కు'..
రేటింగ్.. 2/5
ఇదీ చదవండి: ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter