Aadi Sai Kumar Prema Kavali వారసత్వ హీరోలు వచ్చిన వారెంతో మందో కనిపించకుండా పోతున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు నిలదొక్కుకుంటున్నారు. అలా హీరోలు సక్సెస్ అవ్వడానికి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉన్న వారికి ఇండస్ట్రీలో ఎప్పుడూ చోటు ఉంటుంది. అలా గత పన్నెండేళ్ల నుంచి తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు ఆది సాయి కుమార్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేమ కావాలి అనే సినిమాతో ఆది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సాయి కుమార్ కొడుకుగా ఆది గ్రాండ్‌గా లాంచ్ అయ్యాడు. ప్రేమ కావాలి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఏకంగా వంద రోజులు కూడా ఆడేసింది. అలా మొదటి సినిమా ప్రేమ కావాలితో ఆడియెన్స్ నుంచి ప్రేమ దొరికింది. లవ్ లీ, సుకుమారుడు ఇలా కొత్తగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లాడు.


ఫలితాలతో సంబంధం లేకుండా తన అభిమానులను అలరించేందుకు విభిన్న జానర్లను ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆది సాయి కుమార్. అలా ఆయన కెరీర్‌లో శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల సినిమాలు వచ్చాయి. ఇక కరోనా వల్ల ఆయన సినిమాలు ఆలస్యం అవుతూ గత ఏడాదిలోనే ఐదు సినిమాలు వచ్చాయి.


తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో, బ్లాక్, అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా సందడి చేశారు. ఇప్పుడు ఓటీటీలో పులి మేక అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో కనిపించి మెప్పించాడు. త్వరలోనే సీఎస్ఐ సనాతన్ సినిమాతో రాబోతోన్నాడు.


అలా ఆది ఎప్పుడూ సినిమాలే లోకంగా, అభిమానుల అలరించడమే ధ్యేయంగా ఉంటున్నాడు. త్వరలోనే ఆదికి తన స్థాయికి తగ్గ విజయం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు అయితే పులి మేక అనే వెబ్ సిరీస్‌తో సందడి చేస్తున్నాడు.


Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్


Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook