Aadi Sai Kumar Top Gear Trailer Update యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ ఈ ఏడాది ఆడియెన్స్‌ను వరుసగా పలకరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలతో తన అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మూడో సినిమాతో అందరినీ మెప్పించేందుకు వచ్చేస్తున్నాడు. ఆది నటించిన టాప్ గేర్ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. టాప్ గేర్ అంటూ ఆది సాయి కుమార్ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని కేవీ శ్రీధర్ రెడ్డి శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీలో రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ భారీ ఎత్తున చేపట్టింది.


రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను మారుతి విడుదల చేశారు. టీజర్‌లోని చేజింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా జనాలను మెప్పించాయి. ఇక ట్రైలర్‌తో మరోసారి సినిమా మీద అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. ఈ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 18న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు.


అయితే ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది కాస్త సీరియస్ లుక్కులో కనిపిస్తున్నాడు. ఇక ఆది మెదడులో ఈ చేజింగ్ సీన్లకు సంబంధించిన షాట్‌ను పెట్టేశారు. అంటే ఈ చేజింగ్ సీన్లకు సినిమాలో చాలానే ప్రాముఖ్యత ఉందని అర్థమవుతోంది.  ఈ మూవీలో ఆది ట్యాక్సీ డ్రైవర్‌గా నటించిన విషయం విదితమే. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి వంటివారితో పాటుగా చమ్మక్ చంద్ర వంటి కమెడియన్లు కూడా నటించారు.


Also Read : Jabardasth Anchor Sowmya : యాంకర్ రష్మీకే ఎసరు పెట్టేసింది.. దుమ్ములేపేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య


Also Read : Atlee wife Priya Pregnancy : తండ్రి కాబోతోన్న డైరెక్టర్ అట్లీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook