Lakme Fashion Show: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ షోతో అదరగొట్టిన ఎంపీ
Lakme Fashion Show: ఆమ్ ఆద్మీ పార్టీ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఆప్ పార్టీ నేతలు కేవలం రాజకీయాల్లోనే కాదు..ఫ్యాషన్ వీక్స్‌లో కూడా అదరగొడుతుంటారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అదే జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్..
Lakme Fashion Show: ఆమ్ ఆద్మీ పార్టీ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఆప్ పార్టీ నేతలు కేవలం రాజకీయాల్లోనే కాదు..ఫ్యాషన్ వీక్స్‌లో కూడా అదరగొడుతుంటారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అదే జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్..
దేశ రాజధాని ఢిల్లీ తరువాత పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకుని అందర్నీ ఆకట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజకీయాల్లోనే కాదు..ఫ్యాషన్ షోల్లోనూ ఉంటామని నిరూపిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వార్తల్లో నిలిచారు. ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ షోలో అదరగొట్టేశారు. షో స్టాపర్‌గా తళుక్కుమన్నారు. ఈ షోలో ఆయన బ్లాక్ కలర్ మెరిసే డ్రెస్, బ్రౌన్ బెల్ట్ ధరించి..అపర్ శక్తి ఖురానాతో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ దృశ్యాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి
పంజాబ్ ఎన్నికల్లో రాష్ట్ర యూనిట్ కో ఇన్‌చార్జ్ గా నియమితులైన రాఘవ్ చద్దా కీలకంగా వ్యవహరించారు. పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకోవడంతో కీలకపాత్ర పోషించారు. 33 ఏళ్ల వయస్సులోనే రాజ్యసభకు ఎన్నికై..అత్యంత పిన వయస్కుడిగా రికార్డు సృష్టించారు.ఇప్పుడు లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్‌షోతో అదరగొట్టి..అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అనన్య పాండే, కంగనా రనౌత్, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలాలు షో స్టాపర్లుగా సందడి చేశారు.
Also read: Tejasswi Prakash: బుల్లితెర నాగిని తేజస్వి..చీరకట్టులో చంపేస్తోంది కదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook