సినీ పరిశ్రమలో బయోపిక్స్ కొత్త ట్రెండుగా మారడం.. ఆ ట్రెండు పాతబడటం ఎప్పుడో జరిగిపోయింది. గత పదేళ్లలో, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోని నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులపై చాలా బయోపిక్‌ సినిమాలు ( Biopics ) వచ్చాయి. అందులో బ్లాక్ బస్టర్స్ కొన్ని అయితే.. డిజాస్టర్లే ఎక్కువున్నాయి. అయినప్పటికీ ఇంకా బయోపిక్స్‌పై క్రేజ్ మాత్రం పోలేదు. ఇప్పుడు, అదే కోవలో మరో ప్రముఖ దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ ( Aarthi Agarwal’s Biopic ) కోసం ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. Also read: Sushant death case: సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్తి అగర్వాల్ 2015లో అమెరికాలోని తన ఇంట్లోనే ఆర్తి అగర్వాల్ మృతి చెందారు. ఇంట్లోనే మెట్లపై నుంచి జారి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కానీ ఆర్తి అగర్వాల్ మృతి వెనుక వేరే కారణాలు ఉన్నాయని.. లైపోసక్షన్ కాస్మెటిక్ సర్జరీ (liposuction cosmetic surgery) వికటించిన కారణంగానే ఆర్తి అగర్వాల్ చనిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. Also read: మెగా హీరో పాటకు 100 మిలియన్ వ్యూస్


ఇదిలావుంటే, ఆర్తి అగర్వాల్ మృతి చెందిన ఐదేళ్ల అనంతరం ఆమె రియల్ స్టోరీ ఆధారంగా ఒక బయోపిక్ రూపొందించాలని చిత్రనిర్మాతలు యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. టాలీవుడ్‌లో అనతికాలంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నటీమణులలో ఆమె ఒకరు కావడమే ఇప్పుడు దర్శకులు, నిర్మాతలకు ఆమె బయోపిక్‌పై దృష్టిపడేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. ఆమె జీవితంపై సినిమా చేయడానికి హక్కులు సంపాదించడానికి వివిధ చిత్రనిర్మాతలు ఆర్తి అగర్వాల్ కుటుంబాన్ని సంప్రదించినట్లు సమాచారం. Also read: Nani: భలే భలే మగాడివోయ్ సీక్వెల్ చేయనున్న నాని?


మార్చి 5, 1984న జన్మించిన ఆర్తి అగర్వాల్.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అందరితో కలిసి పనిచేశారు. దురదృష్టవశాత్తుగా ఆమె 30 సంవత్సరాల వయసులోనే తన ప్రాణాలు కోల్పోయింది. ఐతే, ఆర్తి అగర్వాల్ బయోపిక్‌పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. Also read: Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ యూట్యూబ్ ఛానెల్