Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?
Acharya Movie Trolls: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం `ఆచార్య`. శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. ఎందుకీ ట్రోలింగ్? దాని వెనకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Acharya Movie Trolls: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో గురువారం (ఏప్రిల్ 28) రాత్రి నుంచే 'ఆచార్య' ప్రివ్యూస్ ను ప్రదర్శించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి అంబరాన్ని అంటింది. దాదాపుగా మూడేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా రావడం వల్ల మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
'ఆచార్య' మూవీలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తిస్థాయి రోల్ లో చూసిన మెగా అభిమానులకు కన్నుల పండుగలా ఉంది. ఈ చిత్రం రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు అంచనా వేశారు. ఇప్పుడీ సినిమాకు విశేషాదరణ వస్తుంది. అదే విధంగా మరోవైపు సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. డైరెక్టర్ కొరటాల శివ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేనదని ట్రోల్స్ వస్తున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఫ్లాప్ వచ్చిందని విమర్శలు వచ్చాయి.
అయితే మరికొందరికి మాత్రం సినిమా బీభత్సంగా ఉందని అంటున్నారు. చిరు, రామ్ చరణ్ ల కాంబోను తెరపై ఆస్వాదించామని వారు అంటున్నారు. ఏదేమైనా 'ఆచార్య' మూవీ మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అని అంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పూజా హెగ్డే, సోనూసూద్, తనికెళ్ల భరణి, సంగీత తదితరులు నటించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2 వేల స్క్రీన్స్ లో విడుదల చేశారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ గా 'ఆచార్య' ట్రైలర్ నిలిచింది. ఈ సినిమాను మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: Acharya Movie Review: ఆచార్య సినిమా హిట్టేనా..రివ్యూల్లో రేటింగ్ ఎంత..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook