Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. `ఆచార్య` నుంచి మరో సాంగ్ రిలీజ్!
Acharya Movie Update: చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రలుగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం `ఆచార్య`. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి `శానా కష్టం` లిరికల్ సాంగ్ ను విడుదల చేయనుంది చిత్రబృందం.
Acharya Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని మూడో పాటను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.
ఈ చిత్రంలోని మూడో పాటగా 'శానా కష్టం' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జనవరి 3న ఈ ఫుల్ రిలికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
సిద్ధ టీజర్ అదుర్స్
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో చరణ్ శక్తిమంతమైన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన గెటప్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
అంతకుముందు దీపావళి కానుకగా 'నీలాంబరి' (neelambari song acharya) లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను రామ్‌చరణ్, పూజాహెగ్డేలపై తెరకెక్కించారు. మణిశర్మ బాణీలందించిన ఈ మెలోడీ సాంగ్‌లో చరణ్, పూజ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో విపరీతమై క్రేజ్ తెచ్చుకుంది.
100 మిలియన్ల 'లాహే లాహే..'
అయితే ఈ సినిమా నుంచి రిలీజైన తొలి లిరికల్ సాంగ్ 'లాహే లాహే' సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను ఎప్పుడో అందుకుంది.
ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read: Pushpa Deleted Scene: 'పుష్ప' సినిమాలోని డిలీటెడ్ సన్నివేశాన్ని మీరు చూశారా?
Also Read: Ram Charan Remuneration: బాప్‌రే.. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లా.. హాట్ టాపిక్‌గా చెర్రీ రెమ్యునరేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి