Hero Ramcharan's Remuneration: రెమ్యునరేషన్ విషయంలో హీరో రాంచరణ్ తగ్గేదేలే అంటున్నాడని... రాబోయే రెండు సినిమాలకు రూ.100 కోట్లు చొప్పున వసూలు చేస్తున్నాడని కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు రాంచరణ్ ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత... రాంచరణ్ దీనిపై ఏమన్నారు...
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న రాంచరణ్‌కు ఇటీవల ఇదే ప్రశ్న ఎదురైంది. రెమ్యునరేషన్ రూ.100 కోట్లకు పెంచేశారట కదా అని మీడియా ప్రశ్నించగా.. 'రూ.100 కోట్లా...? ఎక్కడున్నాయి... ఉన్నా నాకెవరిస్తారు..' అంటూ నవ్వేశారు. దీంతో రాంచరణ్ రూ.100 కోట్లు రెమ్యునరేషన్ వట్టి గాసిప్ అని తేలినట్లయింది.
రెమ్యునరేషన్ సంగతెలా ఉన్నా... ఆర్ఆర్ఆర్ సినిమాతో (RRR Movie) రాంచరణ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే రాంచరణ్ రెమ్యునరేషన్ ఆటోమేటిగ్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో రాంచరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై (RRR Release) అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు బిగ్ స్టార్స్ పెర్ఫామెన్స్‌ను వెండి తెరపై వీక్షించేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Liger Glimpse : లైగర్ గ్లింప్స్ వచ్చేసింది.. రౌడీ చింపేశాడు.. ఛాయ్‌వాలా ఫైటర్‌గా దుమ్మురేపాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook