Amitabh Bachchan: సినీ పరిశ్రమలో కలవరం.. ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan Hospitalised: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో బిగ్ బీ చేరారనే వార్త సినీ పరిశ్రమ కలకలం రేపింది. ఆయనకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Amitabh Bachchan: బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. కొంత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిన అమితాబ్ చ్చన్ 'యాంజియోప్లాస్తీ' చికిత్స చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చేరిన సమయంలోనే 'ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా' అని అమితాబ్ ట్వీట్ చేయడం గమనార్హం.
Also Read: Mamata Injury: పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయం.. అసలేం జరిగింది?
కొద్దిరోజులుగా అమితాబ్ బచ్చన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అలసట లేకుండా ఉన్నారు. కొంత శారీరకంగా ఇబ్బంది పడ్డట్లు బాలీవుడ్ టౌన్ వర్గాలు తెలిపాయి. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు మాత్రం వైద్యం పొందాలని సూచించారు. ఇన్ పేషెంట్‌గా చేరాలని చెప్పడంతో అమితాబ్ ఆస్ప్రతిలో చేరారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)కు అమితాబ్ ప్రచారకర్తగా ఉన్నారు.
Also Read: Pawan Kalyan: రక్తంతో నిండిన బట్టలతో పవన్ కల్యాణ్.. ఎందుకు? ఏం జరిగింది?
ఈ ఏడాది జనవరిలో బచ్చన్ ఒక సర్జరీ చేసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రభాస్ కల్కీ 2898 సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. చికిత్స అనంతరం కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల కల్కి సినిమా విషయమై అమితాబ్ కీలక విషయం తెలిపారు. 'కల్కి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఆలస్యమైంది. ఈ షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రకటించినట్టు మే 9వ తేదీన విడుదల కానుంది. ప్రేక్షకులను మరపురాని అనుభూతి అందించడానికి ఎంతోమంది శ్రమిస్తున్నారు' అని ఇటీవల ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమాలో ప్రభాస్, దీపిక పదుకొనే, దిశా పఠానీ, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter